హర్యానాలో ఫ్లై ఓవర్ కూలి ఇద్దరికి గాయాలు

నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ ఎలివేటెడ్ కారిడార్ ఆకస్మాత్తుగా కూలింది.ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.

 Two Injured, Flyover,haryana-TeluguStop.com

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం సంభవించలేదని డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా పేర్కొన్నాడు.

హర్యానాలోని గురుగ్రామ్ లో ఘోర ప్రమాదం సంభవించింది.గురుగ్రామ్ లో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ఎలివేటెడ్ కారిడార్ ఆకస్మాత్తుగా కుప్పకూలింది.సమాచారం అందుకున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టీం, రాష్ట్ర నిర్వహణ బృందం, సివిల్ డిఫెన్స్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.అయితే ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తలకు తీవ్ర గాయాలయ్యాయని, వారిని ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు.

రోడ్డుపై ట్రాఫిక్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న అదనపు డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ పన్వర్ సిబ్బందితో కలిసి ట్రాఫిక్ క్లియర్ చేయించారు.

ఫ్లై ఓవర్ పనులపై విచారణ జరపడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఫ్లై ఓవర్ కూలడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా అన్నారు.

ఈ మేరకు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube