ఇద్దరు భారత సంతతి విద్యావేత్తలకు ‘‘ ఆర్డర్ ఆఫ్ కెనడా ’’ అవార్డు..!!

మానవ జాతి అభివృద్ధి కోసం పరిశోధనలు చేస్తున్న ఇద్దరు భారత సంతతి విద్యావేత్తలను కెనడా ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.వీరిద్దరిని ‘‘ఆర్డర్ ఆఫ్ కెనడా’’ అవార్డుకు ఎంపిక చేసింది.

 Two Indo-canadians Honoured With Order Of Canada,canada,order Of Canada Award,queen Elizabeth Ii,parminder Raina, Ajay Agarwal-TeluguStop.com

కెనడా గవర్నర్ జనరల్ మేరీ సైమన్ కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.వీరు అజయ్ అగర్వాల్, పర్మీందర్ రైనా.

వివిధ రంగాలకు చెందిన విజేతలు.జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించారని.

 Two Indo-Canadians Honoured With Order Of Canada,Canada,Order Of Canada Award,Queen Elizabeth II,Parminder Raina, Ajay Agarwal-ఇద్దరు భారత సంతతి విద్యావేత్తలకు ‘‘ ఆర్డర్ ఆఫ్ కెనడా ’’ అవార్డు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాతుర్యం, ఆవిష్కరణలు, దాతృత్వాన్ని ప్రదర్శించారని గవర్నర్ జనరల్ కార్యాలయం ప్రకటనలో తెలిపింది.

అధ్యాపకుడిగా, వ్యవస్థాపకుడిగా దూరదృష్టి గల నాయకత్వం, విద్యార్ధులు, ఔత్సాహిక వ్యాపారవేత్తల విభాగాలలో అజయ్ అగర్వాల్ ను ఎంపిక చేసినట్లు ప్రకటనలో ప్రస్తావించారు.టొరంటో యూనివర్సిటీ రోట్ మాన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో వ్యూహాత్మక నిర్వహణ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తించారు.క్రియేటివ్ డిస్ట్రక్షన్ ల్యాబ్ కు ఫౌండర్ కూడా.

ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , స్పేస్ టెక్నాలజీపై దృష్టి సారించి ఆవిష్కర్తలకు ప్రముఖ ఇంక్యుబేటర్ గా ఉద్భవించింది.

ఇక రైనా విషయానికి వస్తే.దేశంలో వృద్ధాప్యం, ప్రజల ఆరోగ్యం, వృద్ధాప్య సంరక్షణ సేవలకు సంబంధించి జాతీయ విధాన రూపకల్పనలో చేసిన కృషికి గాను ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.ఆంటారియోలోని హామిల్టన్ లో వున్న మెక్ మాస్టర్ యూనివర్సిటీలో క్లినికల్ ఎపిడెమియాలజీ, బయోస్టాటిస్టిక్స్ విభాగంలో రైనా ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్నారు.
ప్రతిష్టాత్మక ‘‘ఆర్డర్ ఆఫ్ కెనడా’’ అవార్డును 1967లో ఏర్పాటు చేశారు.సమాజ అభివృద్ధికి కృషి చేసిన వివిధ రంగాలకు చెందిన వారికి దీనిని అందజేస్తారు.గవర్నర్ జనరల్ విడుదల చేసిన ఆర్డర్ ఆఫ్ కెనడా జాబితాలో 85 మంది వున్నారు.వీరిలో 1996 ఒలింపిక్స్ గేమ్స్ లో 100 మీటర్ల స్వర్ణం గెలిచిన డోనోవన్ బెయిలీ, నటుడు సాండ్రా ఓహ్ కూడా వున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube