బిడెన్ క్యాబినెట్ లో ఇద్దరు భారతీయ అమెరికన్స్ కి స్థానం..!!

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బిడెన్ త్వరలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్దమవుతున్నారు.జనవరి 20 నాటికి ట్రంప్ తన పదవి నుంచీ తప్పుకోవాల్సి ఉంది.

 Two Indo Americans In Biden Cabinet, Biden, Kamala Harries, Vivek Murthi, Arun M-TeluguStop.com

అదే సమయంలో బిడెన్ అధ్యక్షుడిగా శ్వేత సౌధంలోకి అడుగుపెట్టనున్నారు.ఇదిలాఉంటే బిడెన్ త్వరలో ఏర్పాటు చేయనున్న కొత్త టీమ్ లో ఇద్దరు భారతీయ అమెరికన్స్ కి చోటు దక్కనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే బిడెన్ వర్గంలో చోటు దక్కించుకోనున్న ఆ ఇద్దరు భారతీయులు ఎవరు.వారికి బిడెన్ ఎలాంటి భాద్యతలు అప్పగించనున్నారు అనే విషయాలను ఓ సారి పరిశీలిద్దాం.

బిడెన్ ఎన్నికలు వెళ్ళే ముందుగానే బిడెన్ తో పాటు కలిసి అడ్వైజర్ గా పనిచేసిన వివేక్ మూర్తి కి మినిస్టర్ గా చోటు దక్కనుందనే వార్తలు వినపడుతున్నాయి.అలాగే స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్న అరుణ్ మజుందార్ ను కూడా తన క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అమెరికా మీడియా ప్రకటించింది.

అంతేకాదు ఈ ఇద్దరు ఇండో అమెరికన్స్ కు ఎలాంటి శాఖలు అప్పగించాలి అనే క్లారిటీ తో ఉన్నాడట బిడెన్.ఇద్దరూ ఎన్నో ఏళ్ళుగా తనతో జర్నీ చేయడమే కాకుండా వ్యూహాలు రచించడంలో దిట్ట అని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వారి వారి అనుభవాలకి తగ్గట్టుగానే బిడెన్ శాఖలు కేటాయించనున్నారట.

Telugu Arun Manjudhar, Biden, Kamala, Indoamericans, Vivek Murthi-Latest News -

వివేక్ మూర్తి కి హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ శాఖను, అలాగే అరుణ్ మజుందార్ కి ఇంధన శాఖను అప్పగించనున్నట్టు సమాచారం అందుతోంది.ఇప్పటికే బిడెన్ వివేక్ మూర్తికి కరోనా నియంత్రణ బోర్డ్ లో కీలక భాద్యతలు అప్పగించగా అరుణ్ తాను పనిచేస్తున్న స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో డైరెక్టర్ గా, బిడెన్ అడ్వైజరీగా సేవలు అందిస్తున్నారు.అయితే బిడెన్ ప్రమాణ స్వీకారం అయిన తరువాత ఎవరికీ ఎటువంటి పదవులు ఇవ్వనున్నారనే విషయంపై పూర్తి క్లారిటీ వస్తుందని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube