నైజీరియాలో ఇద్దరు భారతీయుల కిడ్నాప్: విదేశీయులకు హెచ్చరికలు

నైజీరియాలో ఇద్దరు భారతీయులు అపహరణకు గురయ్యారు.స్థానికంగా ఓ ఔషధ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు భారతీయులు ఆదివారం విధులు ముగించుకొని బయటకు వస్తుండగా.

 Two Indians Who Worked In Pharma Company Kidnapped By Gunmen In Nigeria,  In Sou-TeluguStop.com

సాయుధులైన దుండగులు వారిని కిడ్నాప్ చేశారు.నైరుతి నైజీరియాలోని ఓయో రాష్ట్ర రాజధాని ఇబదాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.మరోవైపు విదేశీయులను కిడ్నాప్‌ చేసి భారీగా డబ్బు డిమాండ్‌ చేయడం ఈ మధ్యకాలంలో నిత్యకృత్యమైంది.

డబ్బు అందగానే ఆయా ముఠాలు వారిని వదిలిపెడుతుంటాయి.

భారతీయుల కిడ్నాప్ వ్యవహారంపై నైజీరియా పోలీస్ విభాగం అధికార ప్రతినిధి ఓల్గ్‌బెంగ్ ఫెడేయ్ మాట్లాడుతూ.

అపహరణకు గురైన భారతీయులను రక్షించడానికి తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.వారు ఎక్కడ ఉన్నారు, ఎవరు కిడ్నాప్ చేశారనేది ఇంకా తెలియరాలేదన్నారు.

కిడ్నాపర్లు తమ డిమాండ్లు పరిష్కరించమంటూ సంప్రదింపులు మొదలుపెట్టారా? లేదా.? అనేది మాత్రం ఆయన వెల్లడించలేదు.మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో విదేశీ పౌరులంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

Telugu Kidnap Nigeria, Foreigners Sums, Indians, Pharmacompany-Telugu NRI

తమ చుట్టుపక్కల సంచరించే వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉంటే తక్షణమే పోలీసులను అప్రమత్తం చేయాలని అన్నారు.మరోవైపు వందలాది మంది భారతీయులు ఉపాధి కోసం నైజీరియాకు వలస వెళ్తున్నారు.ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమల్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు.

ఇక, విదేశీయులు, ప్రముఖులను నైజీరియాలోని ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి.గతంలో కూడా పలువురు భారతీయులను సాయుధ ముఠాలు కిడ్నాప్ చేయగా, భారత ప్రభుత్వం చొరవతో స్థానిక అధికారులు బందీలను క్షేమంగా విడిపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube