ఇద్దరు 'భారతీయుల' ని వరించిన.. 'ఆసియా నోబెల్'

రంగం ఏదైనా సరే దూసుకు పోవడం మనిషిగా చేయాల్సిన కర్తవ్యం.అద్భుతమైన ప్రతిభ కనపరిచి.

 Two Indians Bharat Vatwani And Sonam Wangchuk Receive Magsaysay Award-TeluguStop.com

సేవ చేయడంలోనూ పరిశోధనల లోనూ ఇలా ఎన్నో రంగాలలో భారతీయులు అత్యంత ప్రతిభావంతులు అని నిరూపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.అయితే ఇద్దరు భారతీయులు మాత్రం తాము ఎంచుకున్నది డబ్బుతో ముడిపడిన అంశం కాదు.

సేవతో ముడిపడిన అంశం.ఆ రంగంలో సైతం ఎన్నో భాధలు వచ్చినా సరే దూసుకు పోయారు.అందుకు గాను

ఎంతో ప్రతిష్టాత్మకమైన అత్యంత గొప్పదైన ఆసియా నోబెల్ పురస్కారంతో పోల్చే రామన్ మెగసెసే అవార్డుకి ఎంపిక అయ్యారు.సమాజశ్రేయస్సుకు పాటుపడిన భారతీయులు సోనం వాంగ్‌ఛుక్‌, భరత్‌ వాత్వానీలు ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసే పురస్కారాలను అందుకున్నారు.గూడు, నీడ కరవై వీధుల్లోనే అల్లాడుతున్న మానసిక రోగుల కోసం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారికి సంరక్షణ ఏర్పాటు చేసిన భరత్‌ వాత్వానీకి మెగసెసే పురస్కారం లభించింది.

అంతేకాదు మారుమూల లద్దాక్‌లో యువత ఎదుగుదలకి వారి అభ్యున్నతికి కారణం అవుతూ వారికి పలు రంగాలలో శిక్షణని ఇస్తూ తనదైన శైలిలో కృషి చేస్తూ ఎంతో మందికి ఉపాది కల్పన చేసి.

మరిన్ని అభివృద్ధి పనులకోసం అధ్యయనం చేస్తూ వ్వవస్థలు, ఆర్థిక ప్రగతి సాధనకు అవకాశాల కల్పన దిశగా కృషి చేసినందుకు గాను వాంగ్‌ఛుక్‌ ఈ అవార్డుకు అర్హులు అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube