అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిసిన భారత సంతతి కాంగ్రెస్ సభ్యులు.. ఎందుకంటే..?

భారతీయ అమెరికన్ చట్ట సభ్యులు డాక్టర్ అమీ బేరా, ప్రమీలా జయపాల్‌లు బుధవారం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిశారు.2013 నుంచి సిలికాన్ వ్యాలీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బేరా.ప్రతినిథుల సభలో ఎక్కువకాలం పనిచేసిన భారతీయ అమెరికన్ చట్ట సభ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.న్యూడెమొక్రాట్ కూటమిలో భాగంగా ఆయన బైడెన్‌ను కలిశారు.ఈ సంకీర్ణ కూటమికి అమీ బేరా కో చైర్‌గా వ్యవహరిస్తున్నారు.ఆర్ధిక విధానాలకు కట్టుబడి వున్న 98 మంది దార్శనికులైన డెమొక్రాట్ చట్టసభ సభ్యులతో ఈ న్యూడెమొక్రాటిక్ కూటమి ఏర్పాటు చేశారు.

 Two Indian American Lawmakers Meet Biden As Part Of Democratic Congressional Gro-TeluguStop.com

117వ కాంగ్రెస్‌కు సంకీర్ణాల ప్రాధాన్యతలను చర్చించేందుకు బైడెన్‌తో అమీబేరా భేటీ అయ్యారని మీడియా కథనాలను ప్రసారం చేసింది.న్యూడెమొక్రాటిక్ కూటమి సభ్యులతో సమావేశం ముగిసిన వెంటనే.

భారత సంతతికి చెందిన మహిళా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ అధ్యక్షతన కాంగ్రెస్ ప్రోగ్రెసివ్ కాకస్ సభ్యులతో బైడెన్ భేటీ అయ్యారు.ప్రతినిధుల సభకు ఎన్నికైన మొదటి , ఏకైక భారత సంతతి మహిళగా ప్రమీలా జయపాల్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

అటు వైట్‌హౌస్ నుంచి ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డైరెక్టర్, భారత సంతతికి చెందిన గౌతం రాఘవన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

కాగా గతవారం ప్రతిష్టాత్మక డాక్టర్ లార్నా బ్రీన్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై బైడెన్ సంతకం చేసినప్పుడు.

భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి వైట్‌హౌస్‌లోనే వున్నారు.ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్స్ మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు గాను కృష్ణమూర్తి చేసిన కృషి ఫలితంగా ఈ చట్టం వచ్చింది.

ప్రతి ఏడాది అమెరికాలో 300కు పైగా వైద్యులు బలవన్మరణానికి పాల్పడుతున్నారని.ఇది సాధారణ ప్రజల ఆత్మహత్యల రేటు కంటే రెట్టింపని రాజా కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

డాక్టర్ లోర్నా బ్రీన్ జ్ఞాపకార్థం దేశ వ్యాప్తంగా వున్న ఆరోగ్య సంరక్షణ నిపుణులకు ఈ చట్టం సహాయం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.కోవిడ్‌తో పోరాడుతూ అధిక పనిగంటలు విధులు నిర్వర్తిస్తున్న ఫ్రంట్ లైన్ హీరోలందరికీ ఈ చట్టం అంకితమని రాజా కృష్ణమూర్తి పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube