ఎన్టీఆర్ కోసం ఒక్కరు కాదు ఇద్దరు  

Two Heroines For Ntr30 - Telugu Ntr, Ntr30, Pooja Hegde, Samantha, Telugu Movie News, Trivikram

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తు్న్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను జనవరి 8వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

Two Heroines For Ntr30

కాగా ఈ సినిమా తరువాత తారక్ మరోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాను ఇటీవల అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్.

ఈ సినిమాను కళ్యాణ్ రామ్ మరియు రాధాకృష్ణ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో తారక్ సరసన పూజా హెగ్డే, రష్మిక మందనల పేర్లు వినిపించాయి.అయితే త్రివిక్రమ్ తనకు బాగా కలిసొచ్చిన ఇద్దరు హీరోయిన్లను ఈ సినిమాలో నటింపజేయాలని ఆలోచిస్తున్నాడు.

ఇందులో భాగంగా స్టార్ బ్యూటీ సమంత, అందాల భామ పూజా హెగ్డేలను ఈ సినిమాలో హీరోయిన్‌గా పెట్టాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడు.ఈ కథలో ఇద్దరికీ కూడా ప్రాముఖ్యం ఉన్న పాత్రలు ఉండటంతో వారైతే సినిమాకు పూర్తి న్యాయం చేస్తారని ఆయన భావిస్తున్నాడు.

ఇక తారక్‌తో ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా గతంలోనే నటించారు.మరి ఈ ఇద్దరు హీరోయిన్లతో కలిసి తారక్ ఎలాంటి సినిమాతో మనముందుకు వస్తాడా అనేది చూడాలి.

తాజా వార్తలు

Two Heroines For Ntr30-ntr30,pooja Hegde,samantha,telugu Movie News,trivikram Related....