న్యూజిలాండ్ : విహారయాత్రలో విషాదం.. సముద్రంలో మునిగి ఇద్దరు భారతీయులు మృతి

న్యూజిలాండ్‌లో విషాదం చోటు చేసుకుంది.బీచ్‌‌లో ఈత కొడుతూ ఇద్దరు భారతీయులు సముద్రంలో మునిగిపోయారు.

 Two Gujarat Men Drown Off At New Zealand Piha Beach Details, Two Gujarat Men, Me-TeluguStop.com

మృతులను సౌరిన్ నయన్ కుమార్ పటేల్ (28), అన్షుల్ షా (31)గా గుర్తించారు.విషాదం జరగడానికి ముందు వీరిద్దరు నార్త్ ఐలాండ్‌లోని పీహా బీచ్‌లో కేవలం 30 నిమిషాలు మాత్రమే గడిపారని ది న్యూజిలాండ్ హెరాల్డ్ వార్తాపత్రిక నివేదించింది.మృతులిద్దరూ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన వారు.వీరిద్దరూ అక్లాండ్‌లో రూమ్‌మేట్స్‌గా వుంటున్నారు.

ఈ ఘటనపై వీరి మిత్రుడు హిరేన్ పటేల్ మాట్లాడుతూ.మృతులతో పాటు మరో వ్యక్తి అపూర్వ్ మోడీ కూడా ఘటనాస్థలిలోనే వున్నాడని చెప్పాడు.

ఇతను వారిద్దరిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ .సాధ్యం కాలేదని హిరేన్ ఆవేదన వ్యక్తం చేశారు.భగవంతుడి దయతోనే అపూర్వ్ ప్రాణాలతో బయటపడ్డాడని, కానీ ఒకే ప్రమాదంలో తమ స్నేహితులను కోల్పోవడంపై ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు.నయన్ కుమార్ పటేల్ ఎలక్రికల్ ఇంజనీర్.అతను గతేడాదే న్యూజిలాండ్ వచ్చాడు.అన్షుల్ షా నవంబర్‌లో ఇక్కడికి వచ్చి, గ్యాస్ స్టేషన్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు.

Telugu Anshul Sha, Gujarat, Drown, Zealand, Zealand Nri, Piha Beach, Piha-Telugu

జనవరి 21న గార్డులు పెట్రోలింగ్‌కు వెళ్తుండగా పటేల్ , షాలు ప్రమాదకర ప్రాంతంలో ఈత కొడుతున్నట్లు గుర్తించారు.ఆ కాసేపటికే వీరికి రెస్క్యూ కాల్ అందినట్లుగా తెలుస్తోంది.అయితే గార్డులు అక్కడికి వచ్చేసరికే ఇద్దరూ గల్లంతయ్యారు.రెస్క్యూ బోట్ ఒకరిని గుర్తించి కాపాడేలోగా.అతను మరింత లోతుకు వెళ్లిపోయాడు.పోలీసులు కూడా హెలికాఫ్టర్‌లో గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో రెండవ వ్యక్తి జాడ కనిపించింది.కానీ అతనిని కూడా కాపాడలేకపోయారు.

పటేల్, షా మరణాన్ని న్యూజిలాండ్‌లోని భారత హైకమీషన్ ధ్రువీకరించింది.ఇది స్థానిక భారతీయ సమాజానికి పెద్ద విషాదమని హైకమీషన్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపింది.

Telugu Anshul Sha, Gujarat, Drown, Zealand, Zealand Nri, Piha Beach, Piha-Telugu

కాగా.గతేడాది అమెరికాలో ప్రమాదవశాత్తూ జలపాతంలో జారిపడి విజయవాడ శివార్లలోని పోరంకికి చెందిన నెక్కలపు హరీశ్ చౌదరి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఇతను ఎంటెక్ పూర్తి చేసి పదేళ్ల క్రితం కెనడాకు వెళ్లాడు.అక్కడ టూల్ మేకర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.హరీశ్‌కు నాలుగేళ్ల క్రితం సాయి సౌమ్యతో వివాహం జరిగింది.ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి న్యూయార్క్‌లోని ప్రఖ్యాత ఇతాకా వాటర్‌ఫాల్స్‌లో విహారయాత్రకు వెళ్లాడు.

అయితే ఫోటో దిగే క్రమంలో హరీశ్ ప్రమాదవశాత్తూ కాలుజారి జలపాతంలో పడిపోయాడు.ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా వుండటంతో అతను కొట్టుకుపోయాడు.

రెస్క్యూ సిబ్బంది కొద్దిగంటల పాటు గాలించి హరీశ్ మృతదేహాన్ని వెలికితీశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube