అమెరికా వెళ్లే యత్నం.. టర్కీలో ఆరుగురు భారతీయులు అదృశ్యం, రంగంలోకి ఇండియన్ ఎంబసీ

అమెరికా- కెనడా సరిహద్దుల్లో గడ్డకట్టిన స్థితిలో ఒక చిన్నారి సహా నలుగురు భారతీయులు శవాలుగా తేలిన వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.తాజాగా టర్కీలో ఆరుగురు భారతీయులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.

 Two Gujarat Families Who Became untraceable In Turkey Found, Turkey, Gujarat Families, Indian Embassy, Canada, America, Turkey Police, Gujarati Families Found, Istanbul-TeluguStop.com

వీరిని గుజరాత్‌లోని గాంధీ నగర్ జిల్లాకు చెందిన రెండు కుటుంబాలుగా గుర్తించారు.తాము టర్కీలోని ఒక హోటల్‌లో వున్నామని.

రెండు మూడు రోజుల్లో తిరిగి వచ్చేస్తామని చెప్పారు.అయితే వారి నుంచి కమ్యూనికేషన్ కట్ అవ్వడంతో గుజరాత్‌లోని బంధువులు ఆందోళనకు గురవుతున్నారు.
గుజరాత్ లోని కలోల్ తాలూకాకు చెందిన తేజస్ పటేల్ కొద్ది రోజుల క్రితం తన భార్య అల్కా పటేల్, కొడుకు దివ్య పటేల్ తో కలిసి అమెరికాకు బయల్దేరాడు.అలాగే సురేష్ పటేల్ అనే వ్యక్తి సైతం తన భార్య శోభ, కూతురు ఫోరమ్‌తో కలిసి యూఎస్ వెళ్లేందుకు ఇంటి నుంచి బయల్దేరాడు.

 Two Gujarat Families Who Became

టర్కీ మీదుగా అమెరికా వెళ్లే క్రమంలో ఈ రెండు కుటుంబాలు తొలుత ఇస్తాంబుల్ చేరుకున్నాయి.అయితే అటు నుంచి సంబంధాలు కట్ కావడంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు ఇస్తాంబుల్‌లోని ఇండియన్ ఎంబసీని సంప్రదించారు.

దీంతో ఎంబసీ అధికారులు అక్కడి అధికారులను అప్రమత్తం చేశారు.

అటు ఈ విషయంపై సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.అసలు అమెరికా వెళ్లాల్సి వస్తే.ఈ రెండు కుటుంబాలు ఇస్తాంబుల్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సరైన అనుమతులు లేకుండా అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ఇస్తాంబుల్‌కు చేరుకున్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.మరోవైపు ఈ వ్యవహారంలో కిడ్నాప్ కోణం వుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.విదేశీయులను అక్రమంగా అమెరికాకు తరలించే ముఠా ఏమైనా వీరిని కిడ్నాప్ చేసిందా అన్న కోణంలోనూ టర్కీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లా డింగుచా గ్రామానికి చెందిన నలుగురు కూడా కొన్ని రోజుల క్రితం అదృశ్యమయ్యారు.

యూఎస్- కెనడా సరిహద్దుల్లో మరణించింది వీరి కుటుంబమేనని గ్రామస్తులు భావిస్తున్నారు.ఈ వార్త బయటకు వచ్చిన నాటి నుంచి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అదృశ్యమైన వారిని జగదీశ్ పటేల్ అతని భార్య వైశాలి, వారి ఇద్దరు పిల్లలుగా చెబుతున్నారు.జగదీశ్ పటేల్ కుటుంబం డింగుచాకి చెందినదేనని.

ఆయన తల్లిదండ్రులు గ్రామంలోనే వుండేవారని.కానీ జగదీశ్ మాత్రం ఇక్కడికి దగ్గరలోని కలోల్‌లో నివసించేవాడని గ్రామ రెవెన్యూ అధికారి చెబుతున్నారు.

అయితే కోవిడ్ కారణంగా జగదీశ్ ఇటీవలే తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడని.మళ్లీ రెండు నెలల క్రితం కలోల్‌కు వెళ్లిపోయారని అధికారి తెలిపారు.

Two Gujarat Families Who Became "Untraceable" In Turkey Found, Turkey, Gujarat Families, Indian Embassy, Canada, America, Turkey Police, Gujarati Families Found, Istanbul - Telugu America, Canada, Gujarat, Gujarati, Indian Embassy, Istanbul, Turkey

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube