ప్రస్తుత కాలంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు మాత్రం ఆగడం లేదు.కాగా ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను బట్టి చూస్తే మహిళలకి బాహ్య ప్రపంచం లోనే కాదు తమ సొంత అనుకున్న వాళ్ల దగ్గర కూడా రక్షణ లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
అయితే తాజాగా కంటికి రెప్పలా తన పిల్లలని కాపాడుకోవాల్సిన కన్నతండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి ఇద్దరు కూతుళ్లపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన టువంటి తిరువేండ్రపురం అనే ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.
అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈ వ్యక్తి భార్య అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో స్థానికంగా ఉన్నటువంటి మరో మహిళను వివాహం చేసుకున్నాడు.అయితే ఈ వ్యక్తి భార్య పని నిమిత్తమై బయటకు వెళ్లడంతో ఇంట్లో తన ఇద్దరు కూతుర్లు ఆడుకుంటున్నారు.
అప్పటికే కామాంధకారంలో పూర్తిగా మునిగిపోయిన ఆ కసాయి తండ్రి తన కన్న కూతురు అనే కనికరం కూడా లేకుండా అభం శుభం తెలియని చిన్నారులపై దారుణంగా అత్యాచారం చేశాడు.అంతేగాక ఈ విషయం గురించి తన తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించాడు.
దీంతో ఇద్దరు చిన్నారులు కిక్కురుమనకుండా ఉండిపోయారు.అయితే చిన్నారుల ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి ఏమైందని నిలదీయగా చిన్నారులు తమపై జరిగినటువంటి అఘాయిత్యం గురించి తన తల్లితో చెప్పుకొని విలపించారు.
దీంతో వెంటనే బాలికల తల్లి బాధితురాళ్లను వెంటబెట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి కీచక తండ్రి పై ఫిర్యాదు నమోదు చేసింది.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
దీంతో కొందరు నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ అభం శుభం తెలియని చిన్నారులపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ కీచక తండ్రి ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.