అవ్వా.. బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతులు నడిరోడ్డుపై ఏకంగా..?!

ఒక రాధ ఇద్దరు కృష్ణులు.ఒక లైలా ముగ్గురు దేవదాసులు.

 Two Girls Fighting For The Boy Friend On The Middle Of The Road , Girls Fight, V-TeluguStop.com

ఇలా ఒక అమ్మాయిని ప్రేమించే మగవాళ్ళని మనం ఎంతో మందిని చూసి ఉంటాము.ఒక అమ్మాయి కోసం ఇద్దరు మగవాళ్ళు, లేదంటే ముగ్గురు మగవాళ్ళు కొట్టుకోవడం, తన్నుకోవడం గురించి వినే ఉంటాము.

కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అండోయ్.ఒక కృష్ణుడు ఇద్దరు గోపికలు అన్నట్టు ఉంది వీళ్ళ యవ్వారం చూస్తే.

అసలు విషయానికి వస్తే.

ఒక అబ్బాయి కోసం ఇద్దరు యువతులు నడిరోడ్డుపై జుట్లు పట్టుకుని మరి తిట్టుకుంటూ, అరుచుకుంటూ, కొట్టుకున్నారు తెలుసా.

ఈ ఘటనకి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.ఇలాంటి ఘటనలను మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము.ఎందుకంటే అమ్మాయి కోసం అబ్బయిలు పోట్లాడుకుంటే అది రొటీన్ కదా.అదే వెరైటీగా ఒక బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ పోట్లాడుకుంటే అది కదా టాక్ అంటే.ఈ ఘటన జార్ఖండ్ లోని సరాయకేలాలో జరిగింది.తన బాయ్ ఫ్రెండ్ వేరే యువతితో క్లోజ్ గా ఉంటున్నాడని తెలిసి ఆ అమ్మాయి కోపంతో రగిలిపోయింది.అలా తన బాయ్ ఫ్రెండ్ ఆ అమ్మాయితో చెట్టా పట్టాలేసుకుని రోడ్డు మీద తిరగడం ఆమె కంట పడింది.వాళ్ళిద్దరిని అలా చుసిన ఆమె కోపాన్ని ఆపుకోలేక, మార్కెట్ లో ఉన్న వారు అందరూ చూస్తుండగానే ఆ అమ్మాయి జట్టు పట్టుకుని లాగేసి, ఇష్టం వచ్చినట్లు ఆ యువతిని తిడుతూ కొట్టసాగింది.

Telugu Boy Friend, Middle Road, Meida, Latest-Latest News - Telugu

కొట్టించుకున్న అమ్మాయి ఎమన్నా తక్కువ తిందా ఏంటి నన్ను కొట్టడానికి నీకు ఎంత దైర్యం అని తిరిగి ఆ యువతిని కొట్టింది.నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఒక్కళ్ళనొకళ్ళు జుట్లు పట్టుకుని కింద పడి మరి కొట్టుకున్నారు.ఆ యువతులు అలా కొట్టుకోవడం చూసి అక్కడ ఉన్న అందరు అవ్వా అని ముక్కు మీద వేలువేసుకున్నంత పని అయిందనుకోండి.ఆ యువతులను విడదీయడానికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అలాగే మరో యువతీ ఎంతగానో ప్రయత్నించారు.

అక్కడ అలా గొడవ జరుగుతున్న విషయం తెలిసి పోలీసులు వచ్చే లోపు ఆ యువకుడు, ఆ ఇద్దరు అమ్మాయిలు అక్కడ నుండి పరారయ్యారు.ప్రస్తుతం ఈవీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోని చూసిన నెటిజన్లు బహుశా ఇదే కలికాలం అంటే అని కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube