లక్కీ బావ బావమరిదులు.. ఏకంగా రూ.1.8 కోట్ల విలువైన బంగారు ముద్దలు లభ్యం...!

అదృష్టం ఎప్పుడు ఎవరికి ఎలా పడుతుందో చెప్పలేని పరిస్థితి.లాటరీ టికెట్స్ కొనే వారికి అనుకోకుండా ఏదో రోజు కోటీశ్వరులు అయిన రోజులు ఎన్నో.

 Two Giant Gold Nuggets Worth $250,000 Found In Australia, Australia, Gold Nugge-TeluguStop.com

అయితే కొన్నిసార్లు మాత్రం ఎప్పటి నుంచో పడుతున్న కష్టానికి అదృష్టం తోడైతే అనుకోకుండా కోటీశ్వరుల జాబితాలో చాలా సులువుగా చేరిపోతారు.ఇలాంటి విషయం తాజాగా దక్షిణ ఆస్ట్రేలియాలో బావ బావమరిదుల విషయంలో జరిగింది.

వారిద్దరూ బంగారం కోసం వేటకు వెళ్లిన సమయంలో అదృష్టం తోడవడంతో ఏకంగా మూడున్నర కిలోల బరువైన 2 బంగారం ముద్దలు దొరకడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ రెండు బంగారు ముద్దల విలువ ఏకంగా 2.5 లక్షల అమెరికన్ డాలర్స్.ఇదే మన కరెన్సీలో చూస్తే.1.8 కోట్లగా ఉంది.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… ఆస్ట్రేలియా దేశం విక్టోరియా రాష్ట్రం లోని తర్నగుల్ల ప్రాంతంలో ఈ బంగారం లభించింది.అయితే ఈ బావ బావమరిదులు బంగారం అన్వేషణ కోసం ఎవరూ వెళ్లని ఓ ప్రత్యేక ప్రాంతానికి వెళ్లారు.

అయితే విరిద్దరూ మెటల్ డిటెక్టర్ సహాయంతో ఈ బంగారాన్ని కనిపెట్టినట్టు వెల్లడించారు.ఇకపోతే వారు ఆ బంగారం గురించి వెతికే కార్యక్రమంలో దొరికిన ఆ బంగారం ముద్దలు బరువు ఎక్కువగా ఉండటంతో వారు వేసిన అంచనా కంటే 30 శాతం ఎక్కువ లభించిందని బావ బావమరిదులు తెలియజేశారు.

ఈ బావ బావమరిదులు ఇతన్, బ్రెంట్ లు ఇద్దరు బంగారం సేకరణలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు.ఇప్పటివరకు చాలా తక్కువ బరువున్న బంగారం దొరికిందని, అయితే ఇంత పెద్ద బంగారం వారికి దొరుకుతుందని అసలు ఊహించలేదని తెలిపారు.

అయితే ఇది వరకు ఓ వ్యక్తి ఐదు కిలోల బరువైన బంగారాన్ని కనుగొన్నాడు.గత వంద సంవత్సరాల పైన నుండి ఆ ప్రాంతంలో బంగారం విరివిగా లభ్యం అవుతోంది.

విదేశాల్లో ఎక్కువగా మెటల్ డిటెక్టర్ ను ఉపయోగించి బంగారం కనిపెట్టడంలో వారు చాలా ముందు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube