అంతరిక్ష పయనానికి ఇస్రో మళ్లీ సిద్ధమవుతుంది.కాగా అంతరిక్షంలోకి భారత ఫ్లైట్ సర్జన్ల ఇద్దరిని పంపడానికి సిద్ధంగా ఉన్నారు.
వీళ్లు వాయుసేన కు సంబంధించిన ఏరోస్పేస్ మెడిసిన్ వైద్య నిపుణులు.వీళ్లను పంపించడానికి కారణం ప్రయోగ సమయంలో రోదసి యాత్రికులు (వ్యోమగాముల) ఆరోగ్యానికి సంబంధించిన విషయంపై బాధ్యత తీసుకోవలసి ఉంటుంది.
కాగా రాబోయే రోదసి యాత్రకు లతో ఫ్లైట్ సర్జను లు కూడా శిక్షణ తీసుకోవడానికి రష్యాకు వెళ్తారని పై అధికారులో ఒకరు తెలిపారు.అంతేకాకుండా అంతరిక్షంలో రోదసిల ప్రయోగాలు ఎంతో ముఖ్యమైనవి.
కాబట్టి వాళ్ల ఆరోగ్య రక్షణ కోసం ఫ్లైట్ సర్జన్ లను పంపనున్నారు.
కాగా ఈ అంతరిక్ష ప్రయోగం కోసం భారత్ కు చెందిన నలుగురు టెస్ట్ పైలెట్ లను అధికారులు ఎంచుకున్నారు.
వీళ్లంతా గత ఏడాది కరోన విజృంభన ముందు శిక్షణ పొందడానికి వెళ్లారు.వీళ్ళ శిక్షణ మాస్కో సమీపంలో యూరీ గగారిన్ రిసెర్చ్ అండ్ టెస్ట్ కాస్మో నాట్ ట్రైనింగ్ సెంటర్ లో జరుగుతుంది.

అంతే కాకుండా ఫ్లైట్ సర్జన్లు తమ శిక్షణ కోసం ఫ్రాన్స్ కు కూడా వెళ్ళవలసి ఉంటుందని తెలిపారు.2018లో ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మరో ఫ్లైట్ సర్జన్ బ్రిగిట్ గోడార్డ్ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చేందుకు భారత్ కు వచ్చారు.అంతేకాకుండా ఫ్రెంచ్ లో ఇచ్చే శిక్షణ పూర్తి స్థాయిలో ఉంటుందని అధికారి తెలిపారు.
కాగా భారత్ ఫ్లైట్ సర్జన్లు ఫ్రాన్స్ లో శిక్షణకు వెళ్లే తరుణంలో అక్కడ పూర్తిస్థాయిలో మెకానిజం ఉంటుందని.
అంతేకాకుండా స్పేస్ క్లినిక్ కూడా ఉందని తెలిపారు.ఇది ఇది జాతీయ కేంద్ర విద్య కు సంబంధించి ఉంటుంది.అంతే కాకుండా స్పేస్ సర్జన్ల కు కూడా శిక్షణ ఇస్తారని అధికారి తెలిపారు.