వైరల్: ఇంత పొడవైన ట్రక్కుని మీరు చూశారా? టైర్ల మధ్యలో డ్రైవర్!

సోషల్ మీడియాలో ఒక్కోసారి వైరల్ అవుతున్న వీడియోలను చూసినపుడు మనకి నోటివెంబడి మాటలు రావు.ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మీరు జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద పెద్ద ట్రక్కులు చూసే వుంటారు.ఒక్కోసారి మరీ భారీ ట్రక్కులను( Trucks ) చూసినపుడు నోళ్లెళ్లబెట్టి చూస్తూ వుండిపోతాం కూడా.

అంత భారీ వాహనాలను ఎలా నడుపుతున్నారో అని తెగ గుసగుసలాడుకుంటూ వుంటాం కదా.ఎందుకంటే ఈ వాహనాలను రివర్స్ చేయడం, యూటర్న్ తీసుకోవడం కత్తిమీద సాములాంటిది మరి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ భారీ ట్రక్కు కూడా అదేవిధంగా చాలా మందికి షాక్ ఇచ్చింది.ఆ భారీ ట్రక్కును ఏకంగా ఇద్దరు డ్రైవర్లు నడుపుతున్నారు అంటే మీరు నమ్ముతారా? కాగా ఆ వీడియోను అమెరికాలోని( America ) కెంటకీ రోడ్డులో( Kentucky Road ) చిత్రీకరించారు.ఈ వీడియోలో ఓ వ్యక్తి కారులో వెళుతూ ఓ ట్రక్కును వీడియో తీశాడు.

Advertisement

దాంతో ఈ దృశ్యం వెలుగు చూసింది.ఆ ట్రక్కుకు రెండో డ్రైవర్( Second Driver ) కూడా ఉన్నాడు.

ఆ డ్రైవర్ ట్రక్కు రెండు చక్రాల మధ్య కూర్చుని స్టీరింగ్ తిప్పుతున్న దృశ్యాలు మనం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో( Social Media ) తెగ వైరల్‌గా మారింది.ఈ వీడియోను ఇప్పటికే రెండు లక్షల మందికి పైగా చూడడం గమనార్హం.ఈ క్రమంలో ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

‘ఇది నిజంగా బ్యాక్ సీట్ డ్రైవింగ్’ అని ఒకరి కామెంట్ చేస్తే, ‘చాలా ప్రమాదకర పరిస్థితుల్లో కూర్చుని డ్రైవ్ చేస్తున్నాడు, ప్రాణం మీద ఆశ లేదేమో!’ అని మరొకరు కామెంట్ చేశారు.కొంతమంది ‘ఆ డ్రైవర్‌ భద్రత కోసం కనీస జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టు పాటించడం లేదు’ అని కామెంట్ చేస్తే మరికొంతమంది ‘అంత సాహసోపేతమైన పని చేస్తున్న డ్రైవర్‌కు జీతమెంతో?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి : మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి...
Advertisement

తాజా వార్తలు