ఎన్టీఆర్ కోసం ఇద్దరు డైరెక్టర్ల పోటీ  

Two Directors Ready For Ntr-ntr,rajamouli,rrr,trivikram

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసిన డైరెక్టర్లు అందరూ దాదాపు స్టార్ స్టేటస్‌లో ఉన్న డైరెక్టర్లుగా మారారు.రాజమౌళి మొదలుకొని త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల శివ ఇలా అందరూ స్టార్ డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు.

Two Directors Ready For Ntr-ntr,rajamouli,rrr,trivikram-Telugu Gossips Two Directors Ready For Ntr-ntr Rajamouli Rrr Trivikram-Two Directors Ready For NTR-Ntr Rajamouli Rrr Trivikram

కాగా ఈ డైరెక్టర్లు ఎప్పుడు అవకాశం దొరికినా తారక్‌తో సినిమా చేసేందుకు రెడీ అంటారు.

అయితే ప్రస్తుతం తారక్‌ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తరువాత తారక్‌తో సినిమా చేసేందుకు ఇద్దరు స్టార్ డైరెక్టర్లు రెడీగా ఉన్నట్లు ఫిలిం నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.తారక్‌తో రీసెంట్‌గా అరవింద సమేత సినిమాతో సక్సెస్ కొట్టిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీని తారక్‌తో తీయాలని ప్లాన్ చేస్తున్నాడు.

కాగా జనతా గ్యారేజ్‌ సినిమాతో బ్లాక్‌బస్టర్ బొమ్మ అందుకున్న మరో డైరెక్టర్ కొరటాల శివ కూడా ఎప్పటినుంచో తారక్‌తో మళ్లీ సినిమా తీయాలని చూస్తున్నాడు.కాగా వీరిద్దరు డైరెక్టర్లలో తారక్ ఎవరికి మొదటి ఛాన్స్ ఇస్తాడా అనే అంశం ఇప్పుడు ఇండస్ట్రీ జనాలలో ఆసక్తిగా మారింది.

ఏదేమైనా తమ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను తారక్‌తో చేయాలని ఆతృతగా చూస్తున్నారు ఈ ఇద్దరు డైరెక్టర్లు.అంటే తారక్‌తో సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని తెలుగు దర్శకుడు ధీమాగా ఉన్నారు.

తాజా వార్తలు