“ఉప ముఖ్యమంత్రులా? అవమానాల మంత్రులా?   Two Deputy Chief Ministers…Face Struggle In TDP     2017-12-29   22:08:08  IST  Bhanu C

ఒక కుటుంభం యొక్క గొప్పదనం చెప్పుకోవాలి అంటే ఆ ఇంటి పెద్ద..ఆ కుటుంభం లో ఉండే మరి కొతమంది పెద్దవాళ్ళు ఇల్లా వారి వారి అనుభవం..అన్ని మిళితమై ఉంటాయి..అలాగే ఒక రాజకీయ పార్టీ గురించి చెప్పుకోవడానికి మాత్రం ఆ పార్టీలో ఉండే సీనియర్స్..వాళ్ళు ఎప్పటి నుంచీ ఉంటున్నారు..వారికి ఎంత కేడర్ ఉంది ఇలాంటి అంచనాలు ఉంటాయి..ఒక కొత్త పార్టీకి..ఎంతో చరిత్ర గల పార్టీకి ఉండే తేడా ఇదే..

అయితే తెలుగుదేశం పార్టీ లో ఎంతో మంది సీనియర్ నాయకులు..తలపండిపోయిన నాయకులు ఎంతో మంది ఉన్నారు..అయితే బాబు కొత్త దనం కావాలని అనుకుంటున్నారో లేక మరేదైనా రీజన్ ఉండే లేదో కానీ సీనియర్స్ ని మాత్రం దూరం పెడుతున్నారు అని అర్థం అవుతోంది అంటున్నారు విశ్లేషకులు..దీనికి నిదర్శనమే ఈ మధ్యలో జరిగిన ఉప ముఖ్యమంత్రుల అవమానాల ఎపీసోడ్స్..పొమ్మనలేక పొగ బెడుతున్నారా అన్న చందంగా ఉంది వీరి పరిస్థితి పేరుకే ఉప ముఖ్యమంత్రులు..అధికారం ఉంది కానీ..స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. పేరుకు మాత్రం కెఇ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్పలు ఉపముఖ్యమంత్రులు..ఈ పదవులు ఇచ్చింది ప్రోటోకాల్ కోసమా అన్నట్టుగా ఉన్నాయి..మొన్నటికి మొన్న కెఈ .క్రిష్ణమూరికి కూడా ఇదే రకమైన అవమానం జరుగగా ఇపోపుడు నిమ్మకయల.చినరాజప్పకి అవమానం జరిగింది..దాంతో వీరు ఇద్దరు ఉత్తుత్తి మంత్రులు అని ఏపీలో చాలా మంది డిసైడ్ అయ్యారు అని సోషల్ మీడియాలో కోడై కూస్తోంది.

అసలు విషయం ఏమిటి అంటే..ఫోరెన్సిక్ ల్యాబ్ భవనాన్ని చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అయితే, ప్రారంభోత్సవంలో నిమ్మకాయల చినరాజప్ప కనబడలేదు..దాంతో చంద్రబాబు హోంమంత్రి నిమ్మకాయలతోనే మాట్లాడారు. దాంతో అసలు విషయం తెలిసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి హోంమంత్రికి అందాల్సిన రీతిలో ఆహ్వానం అందలేదట. దాన్ని అవమానంగా భావించిన నిమ్మకాయల అసలు కార్యక్రమానికే గైర్హాజరయ్యారు.అంతేకాదు ఇద్దరు మంత్రులకి కూడా వారికి స్వతహాగా ఏ అధికారినీ బదలీ చేసే అవకాశం లేదు.

సహచర మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలెవరైనా సిఫారసు చేసినా బదిలీలు, పోస్టింగులు వేయించే అధికారం కూడా లేదు. ప్రతిదీ చంద్రబాబు లేకపోతే లోకేష్ చెప్పాల్సిందేనట..పార్టీకోసం ఎంతో సేవ చేస్తున్న మేము ఇన్ని అవమానలని భరించాలా అంటూ భాదపడుతున్నారట..ఒకానొక సందర్భంలో వీరు రాజేనామాలు చేస్తున్నారు అంటూ కూడా రూమర్స్ రావడంతో చంద్రబాబు ఇద్దరినీ బుజ్జగించారట.. అది తెలుగుదేశం లో సీనియర్స్ కి ఇచ్చే గౌరవం..మరి జూనియర్స్ సంగతి ఎలా ఉందో అంటూ చెవులు కొరుక్కుంటున్నారు కార్యకర్తలు..