ఆ రెండు రౌడీ కాకులపై ప్రజల ఫిర్యాదు!

అక్కడ ఓ రెండు కాకులు ప్రజలను వేధిస్తున్నాయి.అంటే అన్ని కాకులు కాదు! కేవలం రెండు కాకులు మాత్రమే .

 Aggressive Two Crows Damaging Cars In Uk-TeluguStop.com

దీనిపై వారు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.ఇంతకీ ఆ కాకులు అలా వారిని ముప్పతిప్పలు పెట్టడానికి కూడా ఓ కారణం ఉంది.

ఆ వివరాలు తెలుసుకుందాం.యూకేలోని కార్లిస్లే, లిటిల్‌ ఓవర్‌ ప్రాంతాల్లో కొన్ని రోజులుగా కార్ల విండ్‌ స్క్రీన్‌లు పాడు చేస్తున్నాయట.

 Aggressive Two Crows Damaging Cars In Uk-ఆ రెండు రౌడీ కాకులపై ప్రజల ఫిర్యాదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో వాటి పేర్లు 60 దశకం నాటి అండర్‌ వరల్డ్‌ కవల డాన్ల పేర్లు.రోనీ, రేగీ అని పెట్టారు.

మొదట్లో అందరూ ఎవరో తెలియని వ్యక్తి కార్లపై గీతలు పెడుతున్నారు అనుకున్నారు.చివరికి అద్దాలు సైతం పగులగొడుతున్నాయి.

ఆ కార్లలో ఉండే విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిపోతున్నాయి.దీనంతటకు కారణం ఏంటో తెలుసుకోవాలని కొంతమంది కాపలాగా ఉన్నారు.అప్పుడు వారికి ఓ షాకింగ్‌ న్యూస్‌ తెలిసింది.ఇదంగా చేస్తోంది కాకులని గుర్తించారు.ఈ కాకులు చేస్తుంది అంతా ఇంత కాదు.కారు అదద్దాలు కనిపిస్తే చాలు.

వాటిని పగులకొట్టడం, రెట్ట వేయడం, మొత్తంగా కారును ఏదో విధంగా నాశనం చేయనిదే అవి ఉండవు.దీన్ని గ్రహించిన స్థానికులు కాకులే కదా! తరిమేస్తే పోలా.

అనుకున్నారు.కానీ, అవి వింటాయా? అవి మనం ముందుగా చెప్పుకున్నట్లే రౌడీ కాకులు.ఎంత తరిమినా.వెళ్లినట్టే వెళ్లి, మళ్లి వస్తాయి.

ఎంతసేపు వాటికి కాపలాగా ఉంటారు.అంతేకాదు అవి ఏ పనిచేసినా.

రెండూ కలిసే చేస్తున్నాయట.ఈ రోనీ, రేగీల నుంచి తమ కార్లను కాపాడుకునేందుకు అక్కడ దిష్టిబొమ్మలు సైతం ఏర్పాటు చేస్తున్నారు.

అయినా, వాటికి ఆ డాన్‌లు జంకుతాయా ఏంటి? మామూలుగా నడుస్తూ వెళ్తున్న ప్రజల్నే విడవడం లేదు.దీంతో స్థానికులు ఏం చేయాలో పాలు పోకా.

పోలీసులకు ఫిర్యాదు చేశారు.ముందుగా పోలీసులు కూడా ఏంటీ.

కాకులపై ఫిర్యాదా? అని పట్టించుకోలేదు.కానీ, ఆ ఫిర్యాదుల సంఖ్య పెరగడంతో కేసును సీరియస్‌ తీసుకున్నారు.

దీనిపై స్పందించిన బర్డ్స్‌ ప్రొటెక్షన్‌ అధికారి కాకులు ఇంత స్థాయిలో వేధించడం వినలేదని చెప్పారు.ఒకవేళ విండ్‌ స్క్రీన్‌లో తమకు తాము చూసుకొని వేరే పక్షి ఉండవచ్చని అనుకుంటున్నాయేమో అన్నారు.

ఆ ప్రయత్నంలోనే విండ్‌ స్క్రీన్లు పాడవుతున్నాయి కాబోలు అన్నారు.కానీ, స్థానికులు మాత్రం ఆ రోనీ రేగీలకు బాగా ఆకలి వేసి.

అలా చేస్తున్నాయేమోనని ఆహార పదార్థాలు వాటికి పెడుతూ మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

#TwoCrows #RonnieAnd #TwoCrows #United Kingdom #Crows

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు