కీచక టీచర్..ఇద్దరు విద్యార్థునుల పై దారుణం       2018-04-22   23:17:09  IST  Raghu V

కధువా ఘటన ఇప్పటికీ కూడా ఎవ్వరూ మర్చిపోలేదు దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి…ఆ ఘటన జరిగిన తరువాత వరుసగా చిన్న చిన్న పసి పిల్లలపై కూడా హత్యాచారం జరగడంతో ఒక్క సారిగా నిరసనలు ఉదృతం అయ్యాయి దాంతో కేంద్రం హత్యచారాలపై ఒక ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది..ఇక హత్యచారాలపై ఉరిశిక్ష అమలు చేస్తాము అంటూ కేంద్రం తెలిపింది.దాని నియమ నిభందనలు కూడా వెల్లడి చేసింది అయితే..

ఎన్ని చట్టాలు అమలు లోకి వచ్చినా కామందులు బుడ్డి మాత్రం మారడంలేదు తాజాగా వెలుగు చూసిన సంఘటన ఇందుకు నిదర్సనంగా నిలుస్తోంది…విద్యార్ధులకి చదువు చెప్పవలసిన టీచర్ వారిపై లైంఘిక దాడికి పాల్పడ్డాడు ఇంటిదగ్గర చెప్తే చంపేస్తానని బెదిరిచాడు అని నాలుగో తరగతి చదువుతున్న విద్యార్ధినులు చెప్తున్నారు..

ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది..పోలీసుల కథనం ప్రకారం.. దినాజ్‌పూర్ జిల్లా రాయ్‌గంజ్‌లోని పాఠశాలకు చెందిన నాల్గో తరగతి విద్యార్థిని స్కూలు పేరు చెబితే భయపడుతోంది. వెళ్లనని మొండికేస్తోంది. దీంతో తల్లిదండ్రులు దగ్గరకు తీసుకుని ఏమైందని అడగగా.. టీచర్ చేస్తున్న ఘోరాలని చెప్పింది విద్యార్థులందరూ వెళ్లిపోయాక క్లాస్‌రూమ్‌లో తమపై అత్యాచారం చేసేవాడని, ఎవరికైనా విషయం చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధిత బాలికలు చెప్పారు.

అయితే ఇలాగే మరొక బాలికపై కూడా ఆ టీచర్ కొన్ని నెలలుగా హత్యాచారానికి పాల్పడ్డాడని తెలుసుకున్న పోలీసులు టీచర్ పై కటిన చర్యలు తీసుకోవాలని కోరారు అయితే నిందితుడు పరారీలో ఉండటంతో అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.