ఏపీలో ఆకలి కేక! రాయలసీమలో దారుణం

మన దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అని దక్షిణ ఆఫ్రికా దేశాలలో వచ్చిన కరువు ఇండియాలో ఎప్పటికి రాదని రాజకీయ నేతలు కథలు చెబుతూ ఉంటారు.అయితే వారి విధానాలకి ఇండియా ఏదో ఒక రొజూ సోమాలియా, కెన్యాలా మారిపోవడం పెద్ద కష్టమైన పని కాద.

 Two Childrens Died With Hungry In Ananatapuram-TeluguStop.com

ఎన్నికలలో లబ్ది కోసం ఉచిత హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత ఆ హామీలు అమలు చేయడానికి ప్రభుత్వ ఖజానా ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడం ఈ మధ్యాకాలంలో చాలా రాష్ట్రాలలో ముఖ్యంగా ఏపీలో పరిపాటిగా మారిపోయింది.ఇదే పరిస్థితి కొనసాగితే ఏపీ లాంటి రాష్ట్రంలో కరువు చాయలు త్వరలోనే వస్తాయని మేధావులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో రాయలసీమ ఒకప్పుడు కరువుతో అల్లాడేది.ఎంతో మంది రాజకీయ నేతలు ఆ ప్రాంతం నుంచి వచ్చిన అక్కడి ప్రజలకి ఆకలి చావులు తప్పలేదు.

ఇప్పటికే అదే పరిస్థితి అక్కడ ఉందా అంటే తాజాగా జరిగిన ఓ సంఘటన అవుననే సమాధానం అవుతుంది.ఆకలికి అలమటించి మట్టి తిన్న ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.

అనంతపురం జిల్లా కదిరి మండలంలోని కుమ్మరవాండ్లపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన యావత్ దేశాన్ని కలవరపెడుతోంది.కర్ణాటక నుంచి వలస వచ్చిన భార్యబార్థాలు కూలీనాలి చేసుకుని జీవన సాగిస్తున్నారు.

కూలి చేస్తేనే వీరికి కడుపు నిండుతుంది.అయితే వీరికి ఉండటానికి ఇళ్ళు తినడానికి తిండి లేదు.

వేసుకోవడానికి దుస్తులు లేవు.వీరికి ఆరుగురు సంతానం.

కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితి.ఆ దంపతులకి పిల్లలను పోషించుకోవడం కష్టంగా మారింది.

దీంతో ఆకలిని తట్టుకోలేని ఇద్దరు చిన్నారులు మట్టితిని మృతి చెందారు.ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారడంతో స్థానికంగా ఎంతో మంది దాతలు ముందుకొచ్చి వారిని ఆదుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube