కలుషిత నీరు కారణంగా ఇద్దరు చిన్నారుల మృతి

చిన్న వారి నుండి పెద్దల వరకు మంచి నీరు అధికంగా తాగాలంటూ వైధ్యులు చెబుతూ ఉంటారు.మంచి నీరు ఎక్కువ తాగడం వల్ల రక్త ప్రసరణ ఎక్కువగా ఉండటంతో పాటు పలు రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు అంటూ డాక్టర్లు చెబుతారు.

 Two Childrens Dead In Contaminated Water-TeluguStop.com

అలాంటి మంచి నీరును తాగడం వల్ల ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌ లోని రాజేంద్ర నగర్‌లో జరిగింది.ఈ దారుణంపై పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్లే.హైదరాబాద్‌ నగర పాలిత ప్రాంతంలోకి వచ్చే రాజేంద్ర నగర్‌లో ఎంఎం పహాడీ ఏరియాలో ఈ సంఘటన జరిగింది.

వాటర్‌ బోర్డు నుండి సరఫరా అయిన మంచి నీటిని తాగడం వల్ల పిల్లలు చనిపోయినట్లుగా హాస్పిటల్‌ రిపోర్ట్‌ ద్వారా వెళ్లడయ్యింది.మంచి నీళ్లు మరీ ఎక్కువగా కాలుష్యం అయ్యి ఉన్నాయని అందుకే ఆ పిల్లలు చనిపోయారంటూ వైద్యులు రిపోర్ట్‌ ఇచ్చారు.

దాంతో రాజేంద్ర నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వౌరీ ప్రారంభించారు.వాటర్‌ బోర్డుకు సంబంధించిన పలువురు అధికారులను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు.

పిల్లల ప్రాణాలు తీసిన కలుషిత నీరుతో స్థానికులు ఆందోళనకు దిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube