Kids Closing Manhole: వైరల్: పిట్టకొంచెం కూతఘనం అంటే ఇదే... తెరచిన మ్యాన్ హోల్ చూడగానే చిన్నారులు ఏం చేసారంటే?

మంచితనం చూపడానికి వయసుతో సంబంధం లేదు.నిజం చెప్పాలంటే అది మన అస్తిత్వంలో ఉండాలి.

 Two Children Closes Opened Manhole On Road Video Viral Details,  Manhole, Kids,-TeluguStop.com

అయితే నేటి కలియుగంలో అలాంటి మానవత్వం గల మనుషులు కనుమరుగైపోయారనే విషయం మాత్రం ఒప్పుకోలేని నిజం.ఇలాంటి సమయంలో కూడా కనీసం ప్రపంచ జ్ఞానంలేని ఓ ఇద్దరు చిన్నారులు చేసిన మంచిపనికి సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ కురుస్తోంది.

అవును, వారి వయస్సు పట్టుమని పదేళ్లు కూడా వుండవు.కానీ బాధ్యతతో కూడుకున్న వారి వ్యవహారం పలువురిని ఆలోచింపజేస్తుంది.

ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియో ఇపుడు అనేక మంది ప్రజలకు గుణపాఠం నేర్పుతుంది.సాధారణంగా రోడ్లపై మ్యాన్‌హోల్స్‌ను తెరిచి వున్నపుడు ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయో వేరే చెప్పాల్సిన పనిలేదు.చాలా దారుణమైన ప్రమాదాలు జరిగి ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతారు.

అయితే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలోని చూసి ఎలా ప్రవర్తించాలో తెలుసుకోండి.

బేసిగ్గా ఎక్కడైనా రోడ్డుమీద మ్యాన్‌హోల్‌లు తెరిచి ఉంటే ఏం చేస్తుంటారు? దాటుకుని వెళ్లిపోతుంటారు లేదా తప్పించుకుని పోతారు.కానీ ఇక్కడ చిన్నారులు అలా చేయలేదు.ఇద్దరి చిన్నారులకు రోడ్డుమీద వెళ్తున్నపుడు మ్యాన్‌హోల్‌ కనిపించగా దగ్గరకు వెళ్లి చూశారు.

అది చాలా లోతు ఉన్నట్లు గమనించారు.వెంటనే రోడ్డు పక్కన ఉన్న చిన్న చిన్న రాళ్లను తీసుకొచ్చి మ్యాన్‌హోల్‌కు ఇరువైపులా ఉంచారు.

ఇలా చేయడం వలన ఆ రోడ్డు మీద వెళ్లే ప్రయాణీకులకు తెరచిన మ్యాన్ హోల్ వలన ఎలాంటి ఇబ్బందులు కలగవని వారు భావించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube