జాగ్రత్త : ఉమ్మివేసినందుకు రెండు కేసులు నమోదు

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు చాలా కఠినంగా ఉంటున్నాయి.రోడ్లపై తిరగవద్దంటూ ఇప్పటికే హెచ్చరించిన పోలీసులు ఇకపై రోడ్లపై కనిపిస్తే కేసులు పెట్టబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.

 Two Caess Registered About The Spits On Road In Telangana, Corona Virus, Spits O-TeluguStop.com

నిత్యావసర వస్తువులకు మినహా ఇతర కారణాలతో రోడ్ల మీదకు వస్తే తాట తీస్తున్నారు పోలీసులు.ఇదే సమయంలో ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేయడం వల్ల కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం రోడ్లపై ఉమ్ము వేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొత్త చట్టం తీసుకు వచ్చింది.

ఆ చట్టంను పెద్దగా పట్టించుకోలేదు.అసు అలాంటి చట్టాలు మన వద్ద పని చేయవులే అని చాలా మంది భావించారు.ఇప్పుడు జనాలు నోరు వెళ్లబెట్టేలా రెండు కేసులను పోలీసులు నమోదు చేశారు.ఒకటి హైదరాబాద్‌ హయత్‌ నగర్‌ పరిధిలో ఒక వ్యక్తి రోడ్డుపై ఉమ్మి వేయడాన్ని గమనించిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు.అతడిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపించారు.ఇక వరంగల్‌ జిల్లా పరకాల ప్రాంతంలో పోలీసులు సాదారణ తనికీల్లో భాగంగా పోలీసులు ఆటోను ఆపి సోదాలు చేస్తున్న సమయంలో ఆటోలో ఉన్న వ్యక్తి రోడ్డుపై ఉమ్మి వేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ప్రభుత్వం ఆషామాషీగా ఏం లేదు.అందుకే కాస్త జాగ్రత్తగా ఉండండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube