విచిత్ర సంఘటన: అక్రమ మద్యం కేసులో చిక్కుకున్న ఎద్దులు.. ఎలాగో తెలుసా?

వినడానికి విడ్డూరంగా వున్నా మీరు విన్నది అక్షరాలా నిజం.అవును, అక్రమంగా తరలిస్తున్న మద్యం కేసులో రెండు ఎద్దులకి శిక్ష పడింది.

 Two Bulls Caught In Illegal Liquor Case Details,  Liquor Case, Viral Latest, New-TeluguStop.com

దాంతో వాటి ఆలనా పాలనా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులుపై పడింది.కట్ చేస్తే వాటిని పోషించలేమని పోలీసులు చేతులెత్తేశారు.దాంతో చేసేది యేమి లేక నిందితులకు అప్పగించారు.ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే.

ఈ సంవత్సరం జనవరి 25న బీహార్‌లోని జాదోపూర్ పోలీసులు, రాంపూర్ టెంగ్రాహి గ్రామ సమీపంలో తనిఖీలు చేపడుతుండగా పశువుల మేతను తరలిస్తున్న ఎద్దుల బండిలో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.దాంతో పశువుల మేతలో దాచిన 960 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఎద్దుల బండిని సీజ్ చేసి ఎద్దులను స్టేషన్‌కు తరలించారు.

ఈ మద్యం కేసులో ఓంప్రకాష్ యాదవ్ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.చట్టం ప్రకారం.

సదరు ఎద్దులను వేలం వేయాల్సి ఉంది.అయితే కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం కొసమెరుపు.

దీంతో మద్యం కేసులోని నిందితుల్లోని ఓం ప్రకాష్ యాదవ్‌‌కు వాటిని అప్పగించారు.

Telugu Bihar Jodh Pur, Liquor, Latest Buffalo, Lillegal Liquor, Om Prakash Yadu,

అయితే ఆ రెండు ఎద్దులపై అతనికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవు.కేవలం వాటి నిర్వహణ బాధ్యతను చూసుకోవాల్సి ఉంటుంది.ఇప్పటికే తిమ్మిది నెలల గడిచిపోయింది.

ఇప్పటి వరకు ఓం ప్రకాష్ భార్య వాటి నిర్వహణ చూసుకుంది.ఈ రెండు ఎద్దులను నిందితుడికి అప్పగించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

దీంతో జాదోపూర్ ఎస్‌హెచ్‌ఓ విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.ఎద్దులను సంరక్షించేందుకు ఓంప్రకాష్ కు ప్రతినెలా రూ.10 వేలు ఇస్తున్నట్లు వెల్లడించారు.‘పోలీస్ స్టేషన్ ద్వారా డబ్బులు ఇస్తున్నాం.

ఎద్దులను వేలం వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.’ అని సదరు పోలీసు అధికారి చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube