నిద్ర మాత్రలు పని చెయ్యక ఇద్దరు అన్నదమ్ములు మృతి!

చిన్నప్పటినుంచి కలిసిమెలిసి ఆడుకొని, ఎంతో ఆనందంగా గడిపిన అన్నదమ్ములు అనుబంధం చివరకు చావు కూడా ఇద్దరిని కలిపి తీసుకు వెళ్ళింది.అన్నదమ్ములు ఇద్దరూ కలిసి సొంత వ్యాపారం పెట్టారు.

 Two Brothers, Sai Kumar And Venkatesh, Frut Shop, Tirupathi, Demart, Pooja Prasa-TeluguStop.com

తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.సాఫీగా సాగుతుందనుకున్న వారి జీవితంలో ఒక్కసారి గా కష్టాల సుడిగుండంలో పడ్డారు.

ఆ సుడిగుండం నుంచి బయటపడే మార్గం తెలియక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని తిమ్మి నాయుడు పాలానికి చెందిన సాయి కుమార్, వెంకటేష్ అనే ఇద్దరు అన్నదమ్ములు కరకంబాడి రోడ్డు లో డీమార్ట్ సమీపంలో పండ్ల దుకాణం నిర్వహిస్తూ, ఇంటింటికి వెళ్లి పండ్లను డోర్ డెలివరీ చేసే వారు.

వీరి జీవితం ఎంతో ఆనందంగా సాగుతున్న సమయంలో సాయికుమార్ తమ్ముడు వెంకటేష్ పూజ ప్రసన్న అనే అమ్మాయిని ప్రేమించి గత నాలుగు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు.వీరందరూ కలిసి ఒకే కుటుంబం లో ఎంతో ఆనందంగా గడిపేవారు.

ఎంతో ఆనందంగా ఉన్న వీరి కుటుంబంలో ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.ఆ పరిస్థితుల నుంచి బయట పడే మార్గం తెలియక తమ్ముడు వెంకటేష్ తన అన్న సాయి కుమార్ కు, తన భార్య ప్రసన్న కి తెలియకుండా పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు.

అయితే వాటి ప్రభావం వారి మీద చూపకుండా వారి ప్రాణాలకు ప్రమాదం లేకుండా బయట పడ్డారు.ఈ విషయం తెలుసుకున్న ప్రసన్న తన భర్త తో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది.

మరుసటి రోజు ఉదయం ఆ అన్నదమ్ములు దామినిడు హౌసింగ్ బోర్డ్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని విగత జీవులుగా కనిపించారు.సంఘటన స్థలంలో వారు ద్విచక్ర వాహనం లో విసిటింగ్ కార్డ్స్ ఉండడంతో పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

రాత్రి సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి బైక్ పక్కన పార్క్ చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.శవాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే తన భార్య తెలిపిన వివరాల మేరకు ఆర్థిక ఇబ్బందుల వల్లే వారు ఇంత దారుణానికి పాల్పడ్డారని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube