ఒకే సైకిల్ ఒకేసారి ఇద్దరు తొక్కుకుంటూ.. ఈ చిన్నారుల టాలెంట్ చూశారా..?

ఒకే సైకిల్ ఒకేసారి ఇద్దరు తొక్కడమంటే కొంచెం ఇబ్బందే.కాని కొంతమంది ఒకేసారి ఇద్దరూ కలిసి సైకిల్ తొక్కుతున్నారు.

 Two Boys Riding The Same Bicycle At The Same Time.. Have You Seen The Talent Of-TeluguStop.com

ఇద్దరూ కలిసి తొక్కుతూ సైకిల్ మీద ప్రయాణిస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతూ ఉంటాయి.అయితే తాజాగా ఇద్దరు చిన్నపిల్లలు కలిసి ఒకేసారి ఒకే సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు.

రోడ్డుపై ఒకే సైకిల్ ను ఇద్దరూ తొక్కుకుంటూ వెళ్లారు.కొంతమంది దీనిని తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో( Social media ) పోస్ట్ చేశారు.

దీంతో ఇది కాస్త నెట్టింట్ చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో రోడ్డుపై ఇద్దరు పిల్లలు ఒకే సైకిల్‌ను( Bicycle ) ఒకేసారి తొక్కుతున్నారు.ఒకవైపు పెడల్ మీద ఒకరు, మరోవైపు పెడల్ మీద మరొకరు ఉండి తొక్కుకుంటూ వెళుతున్నారు.బాగా వేగంతో సైకిల్ నడుపుకుంటూ వెళుతున్నారు.

అంతేకాదు ఇద్దరూ ఎలాంటి తడబాటుకు గురి కాకుండా జాలీగా తొక్కుకుంటూ వెళుతున్నారు.సంతోషంగా, ఉత్సాహంగా చాలా ఎంజాయ్ చేస్తూ సైకిల్ నడుపుకుంటూ వెళుతున్నట్లు ఈ వీడియోలో కనిపించింది.

ఇలా సైకిల్ నడపడానికి పిల్లలిద్దరూ పెద్దగా కష్టపడలేదు.అలాగే ఎలాంటి ఇబ్బందులు కూడా పడలేదు.

బాగా అనుభవం ఉన్నట్లు తొక్కుకుంటూ వెళుతున్నారు.

ఒక నెటిజన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ గా మారింది.పిల్లల టాలెంట్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

వీళ్లు పిల్లలు కాదు.పిడుగులు అంటూ మరికొంతమది కామెంట్ చేస్తున్నారు.

కొంతమంది నెటిజన్లు వీరి ప్రతిభను చూసి మురిసిపోతున్నారు.టీమ్ వర్క్ ( Team work )అంటే ఇలా ఉండాలి.

ఇద్దరూ ఎంత మంచిగా నడుపుతున్నారో అంటూ మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.ఈ వీడియోలో లక్షల్లో లైక్ లు, కామెంట్స్ వస్తోన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube