నడిరోడ్డు పై యువతి పై దాడి చేసిన ప్రేమోన్మాది  

Two Bikers Stab Woman To Death At Kalyan Market -

మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఒక యువతిని పట్టపగలు నడిరోడ్డు పై హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Two Bikers Stab Woman To Death At Kalyan Market

మహారాష్ట్రలోని కళ్యాణ్ మార్కెట్ కి వెళుతున్న 24 సంవత్సరాల యువతిని గుర్తు తెలియని దుండగులు చంపి బైక్ పై వెళ్లిపోయారు.కళ్యాణ్‌ మార్కెట్‌లో బైక్‌పై వెళ్తున్న ఆ యువతిని ఆపిన ఆ దుండగులు కసి తీరా ఆ యువతిని పొడిచి తిరిగి బైక్ పై పారిపోయారు.

అయితే ఈ ఘటనలో లవ్ యాంగిల్ ఉన్నట్లు తెలుస్తుంది.లవ్ చేసి ఇప్పుడు కాదంటున్నదన్న నేపథ్యంలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడం తో ఆ యువతి పై ఈ విధంగా దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తుంది.

నడిరోడ్డు పై యువతి పై దాడి చేసిన ప్రేమోన్మాది-General-Telugu-Telugu Tollywood Photo Image

ఒక ప్రేమోన్మాది పిచ్చి కి 24 ఏళ్ల యువతి తన ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది.ఇటీవల ఇలాంటి ప్రేమోన్మాది ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.

ప్రేమ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం ఈ విధంగా దారుణంగా హత్యకు లకు తెగబడడం ఎక్కువైపోయింది.ఇటీవల దక్షిణ కర్ణాటక లో కూడా ఇలాంటి ప్రేమోన్మాది ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఇంకా ఈ ఘటన మరువక ముందే ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలో కూడా ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.అయితే ప్రేమ కారణంగా మనస్పర్థలు చెలరేగడం తో భేదాభిప్రాయాలు రావడం ఆ యువతి హత్యకు కారణంగా తెలుస్తోంది.అయితే ప్రస్తుతం ఈ హత్యలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.అయితే నడిరోడ్డు పై జరిగిన ఈ ఘటన కు సంబందించిన దృశ్యాలు పక్కనే ఉన్న సీసీటీవీ లో రికార్డ్ అవ్వడం తో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.ఒకరిని చూసి ఒకరు పోటీ పడుతున్నట్లు ఈ విధంగా ప్రమోన్మాదులు రెచ్చిపోతున్నారు.

తాజా వార్తలు

Two Bikers Stab Woman To Death At Kalyan Market- Related....