ఎన్టీఆర్ 30 సినిమాకి సూపర్ ఆఫర్.. ఏంటంటే?

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనుంది.

 Two Biggies To Join Hands For Ntr30 Overseas Rights-TeluguStop.com

ఇందులో మరో మెగా హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.ఇక ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ బిజీ లో ఉంది.

ఈ సినిమా విడుదల డేట్ ఫిక్స్ చేయగా సమయం లేనందున విరామం లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత మరో క్రేజీ డైరెక్టర్ తో చేయనున్నాడు.
ప్రముఖ టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్30 గా రూపుదిద్దుకున్న సినిమాలో నటించనున్నాడు.ఈ సినిమా స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 Two Biggies To Join Hands For Ntr30 Overseas Rights-ఎన్టీఆర్ 30 సినిమాకి సూపర్ ఆఫర్.. ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నందున ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సెట్ లోకి వెళ్లనున్నాడు.త్రివిక్రమ్ కూడా మరో సినిమాలో బిజీగా ఉండగా ఎన్టీఆర్ సినిమా ను కూడా కాస్త పక్కన పెట్టినట్లు తెలిసింది.

ఇటీవల ఈ సినిమాలో ఓ లేడీ పొలిటీషియన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ నటించనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.ఇక ఈ సినిమాకి మరో బంపర్ ఆఫర్ తగిలింది.

ఈ సినిమా గురించి ఇప్పటికే కొన్ని ప్రచారాలు మొదలు కాగా.ఈ సినిమా ఓవర్సీస్ హక్కులకోసం పోటీ కూడా మొదలైంది.ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు సొంతం చేసుకునేందుకు మరో రెండు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఒకటయ్యాయని తెలుస్తుంది.కారణం త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అలా వైకుంఠపురం సినిమా భారీ విజయాన్ని అందుకోగా.

ఈ సినిమా కూడా భారీ విజయం అందుతుందని పైగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడని.ఆ రెండు కంపెనీలు సినీ నిర్మాతలకు ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది.ఒక వేళ ఇది నిజమైతే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కు బడా అవకాశమని చెప్పుకోవచ్చు.

#NTR30 #NtrMovie #Trivikram #TwoBiggies

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు