బస్సు పై పోర్న్ స్టార్ ఫోటోలు.! ఇదెక్కడి విట్టురం అంటారనుకుంటే ఎలా స్పందించారో తెలుసా.?     2018-07-03   01:52:32  IST  Raghu V

ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా.. నిమిషాల వ్యవధిలో అందరికీ తెలిసిపోతోంది. అది కాస్త కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే చాలు.. ఇక అది వైరల్ అయినట్టే. ఇలానే ఇప్పుడు కేరళలలో ఓ బస్సు ట్విట్టర్ లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.

కస్టమర్స్‌ను ఆకర్షించడానికి వచ్చిన ఎలాంటి అవకాశాన్ని వదులుకోవట్లేదు వ్యాపారస్థులు.ఏకంగా బస్సుపై పోర్న్‌స్టార్ల చిత్రాలను పెట్టేసింది. త్రివేండ్రంకు చెందిన చీకూస్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ కంపెనీ.. సంస్థకు చెందిన అన్ని బస్సులపైనా సన్నీ లియోన్, మియా ఖలీఫా, కీరన్ లీ వంటి పోర్న్‌స్టార్ల ఫొటోలను అతికించింది.

ఇక ఈ దెబ్బతో ఒక్కసారిగా వారి బస్సులకు డిమాండ్ పెరిగిపోయింది. పోర్న్ స్టార్ల ఫొటోలతో అందంగా ముస్తాబై రోడ్డుపై వెళ్తున్న బస్సులను చూసేందుకు కూడా జనాలు ఎగబడుతున్నారట. కేరళకే చెందిన ఓ వ్యక్తి ఈ బస్సుల ఫొటోలు తీసి ‘కేరళలోని బస్సులు.. సీరియస్‌గా తీసుకోవద్దు’ అని ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. అయితే ఈ పోస్ట్‌కు పోర్న్‌ స్టార్‌ కీరన్‌ లీ స్పందిస్తూ ‘ఆకట్టుకునేలా’ ఉందనడం ఇక్కడ విశేషం.