దయచేసి నా సినిమాలు చూడకండి: మల్లికా శెరావత్

బాలీవుడ్ సినీ పరిశ్రమలో తొలిసారి గా పరిచయమైన నటి మల్లికా శెరావత్.తను సినిమాల్లోకి రాకముందు ఎయిర్  హోస్టెస్ గా పని చేసింది.

 Mallika Sherawat, Bollywood, Hadras, Khwahish, Hathras, Murder, Guru, Welcome-TeluguStop.com

ఆ సమయంలోని ఢిల్లీకి చెందిన కరణ్ సింగ్ ను వివాహం చేసుకుంది.కాగా సినిమాల కోసం ఆమె తన భర్త నుండి విడాకులు తీసుకుంది.

అయితే పెళ్లి అయిన సంగతి బాలీవుడ్ లో తెలియకుండా దాచింది.ఎందుకంటే విడాకులు తీసుకుందని తెలిస్తే ప్రత్యేకత ఉండదని బయట పెట్టలేదు.

మొదట 2003 లో హిందీలో ఖ్వాహిష్ సినిమా తో ప్రేక్షకులకు పరిచయం అయింది.బాలీవుడ్ లో ప్రత్యేకంగా పేరు సంపాదించుకున్న ఆమె కొన్ని సినిమాలలో అద్భుతంగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.

ఇది ఇలా ఉండగా ఆమె సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ కు ఓ వ్యక్తి వ్యతిరేకంగా స్పందించడంతో… “నా సినిమాలు చూడొద్దని” తెలిపింది.

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హాథ్రస్ ఘటన గురించి అందరికీ తెలిసిందే.

  ఈ ఘటన గురించి మల్లికా శెరావత్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ” మహిళల పట్ల జరిగే ఘటనలు పోయేవరకు, దేశంలో భద్రత నియమాలు వచ్చేవరకు, ఇలాంటి పరిస్థితులే ఉంటాయని, చచ్చినా మారవు అని” ఆమె తెలిపారు.

మల్లికా శెరావత్ చేసిన ట్వీట్ ను చూసిన ఓ వ్యక్తి మల్లికా శెరావత్ నటనపై వ్యతిరేకంగా విమర్శిస్తూ… ”మీరు సినిమాల్లో నటించే పాత్రలు, నిజజీవితంలో ఇచ్చే సలహాలు విరుద్ధంగా, వ్యతిరేకంగా ఉన్నాయని… సినిమాల్లో చేసే పాత్ర, సమాజంలో కూడా అదే పాత్ర ఉంటుందని తెలియదా అని, నిజజీవితంలో పాటించే విధానం మార్చుకొని… తరువాత బయట సందేశాలు ఇవ్వాలని” ఆమెపై మండిపడ్డాడు.

ఇది చూసిన మల్లికా శెరావత్ అతని పై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆమె సదరు వ్యక్తి పెట్టిన ట్విట్ పై స్పందిస్తూ.“నేను నటించిన పాత్రలు సమాజానికి పాడాయ్యేలా ఉన్నాయని నీ ఆలోచన కానీ మీ లాంటి మనస్తత్వం వల్ల దేశంలో మహిళలకు భద్రత లేక పోయిందని.నా సినిమా నీకు ఇబ్బంది అనిపిస్తే చూడటం మానేయు” అని ట్విట్ చేసింది.

దీంతో ఈ ట్విట్ వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube