ఆర్జీవి ఏటకారానికి ఫైన్ తో స్ట్రోక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు  

Twitter Tagging Traffic Police To Handle Ram Gopal Varma-

టాలీవుడ్ లో ఎప్పుడు వివాదాలకి కేరాఫ్ అడ్రెస్స్ గా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.ఇతను చేసిన సినిమాలు హిట్స్ సినిమాలు ఎక్కడో ఒకటి అర అన్నట్లు ఉంటే ఫ్లాప్ సినిమాలు మాత్రం లెక్కలేనన్ని ఉంటాయి.అయిన కూడా తన మాట, బాటతో ఎప్పుడు సంచలనాలకి కేంద్ర బిందువుగా ఉండే వర్మ తాజాగా తన శిష్యుడు పూరీ జగన్నాథ్ మూవీ ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ సందర్భంగా తెగ సందడి చేస్తున్నాడు...

Twitter Tagging Traffic Police To Handle Ram Gopal Varma--Twitter Tagging Traffic Police To Handle Ram Gopal Varma-

ఈ సినిమాకి ఓ వైపు ఎవరేజ్ టాక్ వచ్చిన తెలంగాణ నేటివిటీ కారణంగా కలెక్షన్స్ భాగానే వస్తున్నాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా చూడటానికి ఆర్జీవి, తన మరో శిష్యుడు ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో కలిసి బైక్ మీద వెళ్ళాడు.

ఇక సినిమా తర్వాత ఆ వీడియోని వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ తో సినిమాకి వెళ్లాం.ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ, వాళ్ళు కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమా చూస్తూ ఉన్నారనుకుంటా అంటూ పోస్ట్ పెట్టాడు.

Twitter Tagging Traffic Police To Handle Ram Gopal Varma--Twitter Tagging Traffic Police To Handle Ram Gopal Varma-

వెంటనే ట్రాఫిక్ పోలీసులు కూడా వర్మ ట్వీట్ కి రీట్వీట్ చేసి హెల్మెట్ లేకుండా బైక్ మీద ప్రయాణం చేయడంతో పాటు ట్రిపుల్ రిదింగ్ చేసిన కారణంగా ఫైన్ వేసిన నట్లు అలాగే వర్మ తదితరులు ప్రయాణించిన బండి బద్దె దిలీప్ కుమార్ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్టు ఉందని చలానాని వర్మని షేర్ చేసారు.మొత్తం మూడు తప్పుల కారణంగా 1300 ఫైన్ కట్టాలని అందులో వర్మకి ట్వీట్ చేసి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.