అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతు దారులు అమెరికా కాపిటల్ పై దాడి చేసిన ఘటన అందరికి తెలిసిందే.ఈ ఘటన కారణంగా సుమారు ఐదుగురు మృతి చెందారు.
యావత్ ప్రపంచం మొత్తం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది.ఘటన సమయంలో ట్రంప్ హింసను ప్రేరేపిస్తున్నట్టుగా ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్స్ మరింతగా ఆందోళన కారులను రెచ్చగొట్టాయి దాంతో మరింతగా ఆందోళన కారులు రెచ్చిపోయారు.
చివరికి కేంద్ర బలగాలు రంగంలోకి దిగి ఆందోళన కారులను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.అయితే
ట్రంప్ ట్విట్టర్ ద్వారా ఆందోళన కారులను రెచ్చగొట్టేలా చేసిన ట్వీట్ లపై ట్విట్టర్ స్పందించింది.
తమ సంస్థ ఇలాంటి హింసను ప్రోశ్చహించదని తేల్చి చెప్పింది.ట్విట్టర్ తమ రూల్స్ కు విరుద్దంగా ఇప్పటికే ఎన్నో సార్లు ఇలాంటి ప్రయత్నాలు చేశారని ఈ ఘటనతో చర్యలు తీసుకోక తప్పదని దాదాపు 24గంటల పాటు నిషేధం విధించాలని భావించింది.
ఈ క్రమంలోనే యూట్యూబ్, పేస్ బుక్, మిగిలిన సోషల్ మీడియా సంస్థలు ట్రంప్ పై తాత్కాలిక నిషేధం విధించాయి.అయితే ట్రంప్ పై జీవిత కాలం నిషేధం విధించాలని భావించిన ట్విట్టర్.
ట్రంప్ ఖాతాను శాశ్వతంగా తొలగించి ట్రంప్ కి షాక్ ఇచ్చింది.ఈ నిర్ణయంపై కొందరు ఏకీభవించినా మరో కొందరు వ్యతిరేకత తెలిపారు.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.
ట్విట్టర్ తీసుకున్న నిర్ణయం ట్రంప్ కి షాక్ ఇస్తుందని అనుకుంటే ట్విట్టర్ కు పెద్ద షాక్ తగిలింది.ట్రంప్ ఖాతాను నిదేధించి 24 గంటలు గడిచే లోగానే ట్విట్టర్ షేర్స్ ఒక్క సారిగా కుప్పకూలిపోయాయి.ఒక్కసారిగా సుమారు 7 శాతంషేర్లు పడిపోవడంతో ట్విట్టర్ మార్కెట్ వాల్యూ 2.5 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది.ఇదిలాఉంటే ట్రంప్ హింసని ప్రేరేపించి ఉండచ్చు కానీ భావ స్వేచ్చని హరించే హక్కు మీకు ఎక్కడుంది అంటూ వివిధ దేశాలకు చెందిన కొందరు నేతలు ట్రంప్ కి మద్దతు తెలిపారు.
అయితే తాజా పరిణామాలతో ఉలిక్కిపడిన ట్విట్టర్ నష్ట నివారణ చర్యలకోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి మరి.