కంగనా కి ట్విట్టర్ ' నో'.. వెల్కమ్ చెప్పిన ' క్యూ'..!

ట్విట్టర్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించినందుకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఖాతాను శాశ్వతంగా నిలుపుదల చేసినట్లు మంగళవారం సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్ ప్రకటించింది.తమ ట్వీట్ల ద్వారా సమాజానికి హాని చేకూర్చే అవకాశం ఉన్న ఎవరి విషయంలోనూ ఉపేక్షించబోమని, అటువంటి వారిపై కఠిన చర్యలు అమలు చేస్తామని ట్విట్టర్ ప్రతినిధి ఒకరు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

 Twitter No To Kangana Welcome Q-TeluguStop.com

విద్వేషపూరిత వ్యాఖ్యలు, దూషణలతో కూడిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తాము అమలుచేస్తున్న విధానాలను పదేపదే ఉల్లంఘించిన కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ తరుణంలో బాలీవుడ్ నటి కంగన రనౌత్‌కు సామాజిక మాధ్యమ వేదిక కూ యాప్ స్వాగతం పలికింది.

స్వేచ్ఛగా భావాలను వ్యక్తీకరించేందుకు ఈ వేదికను ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. ట్విట్టర్ ఆమె ఖాతాను శాశ్వతంగా నిలిపివేసిన నేపథ్యంలో కూ ఆమెను ఆహ్వానించింది.

 Twitter No To Kangana Welcome Q-కంగనా కి ట్విట్టర్ నో’.. వెల్కమ్ చెప్పిన క్యూ’..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన ట్విట్టర్ అకౌంట్‌ను ట్విట్టర్ శాశ్వతంగా నిలిపేసిన తర్వాత కంగన రనౌత్ మాట్లాడుతూ, తనకు చాలా వేదికలు ఉన్నాయని, తన భావాలను ప్రజలకు తెలియజేయగలనని చెప్పిన సంగతి తెలిసిందే.ఆమె నిబంధనలను ఉల్లంఘిస్తూ పదే పదే ట్వీట్లు చేస్తున్నారని ట్విట్టర్ ఆరోపిస్తోంది.

కూ యాప్ దేశీయంగా అభివృద్ధి చెందింది.తమ వేదిక స్వేచ్ఛగా అభిప్రాయాలను వెలిబుచ్చేందుకు అవకాశం కల్పిస్తుందని దీని వ్యవస్థాపకులు ప్రకటించారు.

ఇది మీ ఇల్లు వంటిది అని కంగనను వీరు స్వాగతించారు.కూ యాప్‌లో కంగన రనౌత్ ఫిబ్రవరిలో చేరారు.

ఆమె ఈ యాప్‌లో ఇచ్చిన తొలి ‘కూ’ను కూ కో ఫౌండర్ అప్రమేయ రాధాకృష్ణ షేర్ చేశారు.ఇది @kanganarofficial మొదటి కూ.

కూ తన ఇల్లు వంటిదని, మిగిలినవన్నీ అద్దెకు తీసుకున్నవేనని ఆమె చెప్పడం సరైనదే’’ అని పేర్కొన్నారు.కంగన ఇచ్చిన తొలి ‘కూ’లోరాత్రి వేళల్లో పని చేసే ధాకడ్సిబ్బందికి ఇది లంచ్ బ్రేక్.

ఇప్పుడు కూ ఎందుకు వాడకూడదు? ఇది కొత్త వేదిక.ప్రాచుర్యం పొందడానికి సమయం పడుతుంది.

అయితే అద్దెకు తీసుకున్న ఇల్లు ఎప్పటికీ సొంతం కాదు.మీ సొంత ఇల్లు ఎప్పటికీ మీదే’’ అని పేర్కొన్నారు.

#Welcome #Twitter #Bollwood Beauty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు