ట్రోలర్స్ నుండి తప్పించుకునేలా ట్విట్టర్ సర్కిల్..!

ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్లను ప్రవేశ పెట్టాలని చూస్తున్నారు.ఈ క్రమంలో ట్విట్టర్ లో ట్రోలర్స్ బెడద నుండి తప్పించుకోవడానికి తమ ట్వీట్స్ ని కేవలం తమకు ఇష్టం ఉన్న వారితో మాత్రమే పంచుకునేలా ట్విట్టర్ సర్కిల్ అనే కొత్త ఫీచర్ ఏర్పాటు చేస్తున్నారు.

 Twitter New Feature Twitter Circle , Elon Musk , Twitter , Twitter Circle ,-TeluguStop.com

ఈ ట్విట్టర్ సర్కిల్ ద్వారా తమ ట్వీట్స్ కేవలం సెలెక్ట్ చేసిన వ్యక్తులకు మాత్రమే కబడుతుంది.ట్విట్టర్ సర్కిల్ లో తాము ఫాలో అయ్యే వ్యక్తులను యాడ్ చేసి ఒక గ్రూప్ గా ఏర్పాటు చేయొచ్చు.

ట్విట్టర్ సర్కిల్ లో దాదాపు 150 మంది ఒక గ్రూప్ లో ఉండే అవకాశం ఉంది.ఈ కొత్త ఫీచర్ ట్విట్టర్ సర్కిల్ ప్రయోగాత్మక దశలో ఉంది.

త్వరలోనే దీన్ని ప్రవేశ పెట్టాలని చూస్తున్నారు.మీరు వేసే ట్వీట్ కేవలం ఎంచుకున్న వ్యక్తులు మాత్రమే చూసేలా ట్విట్టర్ సర్కిల్ ఉపయోగపడుతుంది.

ఈ ట్విట్టర్ సర్కిల్ ద్వారా ట్రోలర్స్ నుండి కొద్దిమేరకు తప్పించుకునే అవకాశం ఉంటుంది.ట్విట్టర్ సర్కిల్ లో ఉన్న 150 మందిని ఎడిట్ చేసే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది.

సో ఈ ట్విట్టర్ సర్కిల్ కొంతవరకైనా ట్రోలర్స్ బెడద నుండి తప్పించుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.ఇన్ స్టాగ్రాం లో క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్ లానే ట్విట్టర్ లో ఈ ట్విట్టర్ సర్కిల్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube