Twitter : మూత పడే దిశగా ట్విట్టర్‌.. ప్రత్యామ్నాయ యాప్‌లు ఇవే

ట్విట్టర్‌ని సోషల్ మీడియా రాజుగా పిలుస్తారు.సెలబ్రిటీలు, వ్యాపారులు, సామాన్యులు ఎక్కువగా ఇష్టపడే యాప్‌గా ట్విట్టర్ పేరు పొందింది.

 Twitter Is On The Verge Of Closing Down These Are The Alternative Apps ,  Twitte-TeluguStop.com

కానీ దీనిని ఎలోన్ మస్క్ స్వాధీనం చేసుకున్న తర్వాత ప్లాట్‌ఫారమ్ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది.ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాయి.

ట్విట్టర్ బ్లూటిక్, ట్విట్టర్ యూజర్లందరికీ రుసుము విధించాలని యోచించడం వంటి నిబంధనలు చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి.ఈ తరుణంలో వేలాది మంది ట్విట్టర్ ఉద్యోగులను ఎలాన్ మస్క్ తొలగించాడు.

అదే స్థాయిలో ఎలాన్ మస్క్ నిబంధనలు, వ్యవహార శైలి నచ్చక ఆ సంస్థ ఉద్యోగులు బయటికి వచ్చేస్తున్నారు.దీంతో త్వరలో ట్విట్టర్ మూతపడనుందనే వార్తలు వెలువడుతున్నాయి.

దీంతో ఇప్పటి వరకు ట్విట్టర్ యాప్ విస్తృతంగా ఉపయోగించిన వారు ప్రత్యామ్నాయ యాప్‌ల వైపు దృష్టి సారిస్తున్నారు.అలాంటి వాటిలో బెస్ట్ యాప్స్ గురించి తెలుసుకుందాం.

Telugu Alternative, Latest, Ups-Latest News - Telugu

ట్విట్టర్ తరహాలో అవే ఫీచర్లతో చాలా యాప్‌లు ఉన్నాయి. మాస్టోడాన్, కోహోస్ట్, ట్రూత్ సోషల్, ట్రైబల్ సోషల్, కూ, కుటుంబ్, క్లబ్ హౌస్ వంటి యాప్‌లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి.మాస్టోడాన్ యాప్‌ను 2016లో ప్రారంభించారు.ఇందులో 500-అక్షరాల పరిమితి ఉంది.ఎటువంటి ప్రకటనలు ఉండవు.ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఈ యాప్‌కు మరలుతున్నారు.

ఆ తర్వాత స్థానంలో కోహోస్ట్ యాప్ ఉంది.ట్విట్టర్‌లా కాకుండా దీనికి అక్షర పరిమితి లేదు.

ఫేస్ బుక్ తరహాలో ఉంటుంది.త్వరలో ఈ యాప్ తన యూజర్ల నుంచి సబ్‌స్క్రిప్షన్ విధించే అవకాశాలు ఉన్నాయి.

ట్రైబల్ యాప్ కూడా ఎక్కువ మంది యూజర్లను ఆకర్షిస్తోంది.మరొక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో Facebook తరహాలో ఇందులో యూజర్ ఇంటర్ ఫేస్ ఉంది.

ప్లాట్‌ఫారమ్ మీ ఫీడ్‌ని నియంత్రించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.మీ లాంటి మనస్తత్వం ఉన్న మరింత మంది వ్యక్తులను కనుగొనడంలో సహాయపడుతుంది.

ట్విట్టర్ లాగానే, మీరు ప్లాట్‌ఫారమ్‌లో ట్రెండింగ్ మరియు బ్రేకింగ్ పోస్ట్‌లు మరియు వీడియోలను చూడగలరు.ఆ తర్వాతి స్థానంలో Tumblr యాప్ ఉంది.2007లో దీనిని ప్రాంభించారు.ఇందులో మీరు ఫొటోలు, వీడియోలు, GIFలు, కంటెంట్‌ను పోస్ట్ చేయొచ్చు.

మన దేశంలో కూ యాప్ కూడా విస్తృత ప్రాచుర్యం పొందుతోంది.ఇది భారతీయ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్.

మీరు ట్విట్టర్ లాంటి ప్లాట్‌ఫారమ్ కోసం చూస్తున్నట్లయితే, ఇది అదే తరహా లక్షనాలను కలిగి ఉంది.ఇందులో అనేక ప్రాంతీయ భాషలను ఉపయోగించవచ్చు.

గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ అప్లికేషన్ 1 కోటికి పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube