సరికొత్త ఫీచర్లను తీసుకురాబోతున్న ట్విట్టర్..!

ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటారు.ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లను బాగా వాడేస్తున్నారు.

 Twitter Is Going To Bring The Latest Features  Twitter, New Features, Technology-TeluguStop.com

అయితే ట్విట్టర్ వినియోగించే వినియోగదారులలో కొంతమంది 2 అకౌంట్స్ ను ఓపెన్ చేయవలిసిన పరిస్థితి వస్తుంది.ఎందుకంటే ట్విట్టర్ లో మనమేదైనా ట్వీట్ చేస్తే ఆ పోస్ట్ ను అందరూ చూసే అవకాశం ఉంటుంది.

దీని వలన కొంతమంది యూజర్లు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు.అందుకనే వారు పర్సనల్‌, ప్రొఫెషనల్ అని రెండు రకాల ఎకౌంట్లను ఓపెన్ చేసుకుని పోస్ట్ లు పెడుతున్నారు.

ఇలా ఎందుకంటే మన అభిప్రాయాలను కొందరితోనే పంచుకోవాలని అనుకుంటూ ఉంటాము కదా.మరి అలాంటప్పుడు ట్విట్టర్‌లో ఆ వెసులుబాటు లేదు.పెట్టిన పోస్ట్ అందరు చూస్తారు.అందుకే రెండు అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటున్నారు.అదే ఇన్‌స్టాగ్రామ్‌ లో అయితే మన స్టోరీలు మనం ఎంచుకున్న మన క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే చూసే ఫీచర్ అందుబాటులో ఉంది.

ఇప్పుడు అదే మాదిరిగా ట్విట్టర్‌ లోనూ ఆ ఫీచర్ అందుబాటులోకి తేవాలని అనుకుంటున్నారట.

అందుకే ట్రస్ట్డ్ ఫ్రెండ్స్ ను తీసుకురావాలని ట్విట్టర్ ఫిక్స్ అయింది. ఇది ట్విట్టర్ వాడే వినియోగదారులకు ఒక శుభవార్త అని చెప్పాలి.

అలాగే మరొక ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకుని రానుంది.అది ఏంటంటే ట్వీట్లను కేటగిరైజ్ చేయడానికి ఫేస్ ఇట్ ఫీచర్‌ ను తీసుకురానుందన్నమాట.

ఈ మేరకు వీటి డిజైన్లను ట్విట్టర్ వెల్లడించింది.ఈ ఫీచర్ కనుక అందుబాటులోకి వస్తే రెండు ఎకౌంట్లు వాడుతున్న యూజర్లు ఇకపై ఇలా రెండు ఎకౌంట్లను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు.

Telugu Latest, Techologys Ups-Latest News - Telugu

ట్రస్ట్డ్ ఫ్రెండ్స్ ఫీచర్ వలన ఇకపై మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వారితో తేలికగా మాట్లాడవచ్చు.అంతేకాకుండా మీరు ఎంపిక చేసుకున్న గ్రూపు మాత్రమే మీ ట్వీట్ లను చూస్తుంది., చూడగలుగుతుంది.ఈ సరికొత్త ఫీచర్ల ఎర్లీ డిజైన్స్ గురించి ట్విట్టర్ డిజైనర్ ఆండ్రూ కోర్టర్ రాశాడు.అలాగే యూజర్లు తమకు నచ్చని కామెంట్లను, పదబంధాలు వారి కంటపడకుండా కామెంట్ బాక్స్‌లో అవి చిట్టచివరకు చేరిపోయేలా చేసే ఫీచర్ గురించి కూడా ఆలోచిస్తున్నట్టు ఆండ్రూ కోర్టర్ తెలిపాడు.ఇకమీదట యూజర్లు తమ కంటెంట్‌ ను తమకి నచ్చిన వారితో పంచుకోనే అవకాశం ట్విట్టర్ కల్పిస్తోంది.

అలాగే ట్వీట్లను కేటగిరైజ్ చేసే ఫీచర్ ను కూడా తీసుకురాబోతోందని అమెరికన్ టెక్నాటజీ న్యూస్ వెబ్‌సైట్ ది వర్జ్ పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube