టిక్‌ టాక్‌పై కన్నేసిన ట్విట్టర్‌ పిట్ట

చైనా వీడియో స్ట్రీమింగ్‌ అండ్‌ మేకింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ ఇండియాలో బ్యాన్‌ అయ్యింది.అది చైనా యాప్‌ అవ్వడం వల్ల అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా బ్యాన్‌ చేసేందుకు ఆయా దేశాలు రెడీ అవుతున్నాయి.

 Twitter To Purchase Tiktok, Tiktok, Twitter, Microsoft Satya Nadella, Twitter Qu-TeluguStop.com

ముఖ్యంగా టిక్‌టాక్‌కు అమెరికా ప్రభుత్వం గడువు విధించింది.అప్పటి వరకు టిక్‌టాక్‌ను అమెరికన్‌ కంపెనీ ఏదైనా కొనుగోలు చేస్తే అప్పుడు దానిపై బ్యాన్‌ ఉండే అవకాశం లేదు.

గత కొన్ని రోజులుగా మైక్రో సాఫ్ట్‌ వారు ఈ వీడియో స్ట్రీమింగ్‌ యాప్‌ను కొనుగోలు చేసేందుకు చైనాకు చెందిన బైడ్‌ డాన్స్‌ సంస్థతో చర్చలు జరుపుతున్నారు.

టిక్‌టాక్‌ కొనుగోలుకు చర్చలు జరుగుతున్నాయి అంటూ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల ప్రకటించాడు.

ఈ సమయంలోనే ట్విట్టర్‌ సంస్థ కూడా టిక్‌టాక్‌ వీడియో యాప్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.మైక్రోసాఫ్ట్‌ కంటే అధికంగా ట్విట్టర్‌ కోట్‌ చేస్తుందని ప్రస్తుతం టిక్‌టాక్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ట్విట్టర్‌ ఈ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా అంతర్జాతీయ మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా టిక్‌ టాక్‌ను అతి త్వరలో ఏదో ఒక అమెరికన్‌ సంస్థ కొనుగోలు చేయడం ఖాయం, వెంటనే ఇండియాలో టిక్‌ టాక్‌ పున: ప్రవేశం ఖాయం అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube