ట్విట్టర్ సీఈఓ కు కూడా తప్పని హ్యాకింగ్ కష్టాలు  

Twitter Ceo Account Hacked-social Media,twitter Ceo

హ్యాకర్స్ ఎలా రెచ్చిపోతున్నారు అందరికి తెలిసిందే.ఈ హ్యాకర్ల ధాటికి బడా బడా బాబులు కూడా హడల్ ఎత్తిపోతున్నారు.తాజాగా ట్విట్టర్ సీఈవో కు కూడా ఈ హ్యాకింగ్ కష్టాలు తప్పలేదు.ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ ఎకౌంట్ ను కూడా హ్యాక్ చేసేసినట్లు తెలుస్తుంది.డోర్సీ ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు శుక్రవారం హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది.

Twitter Ceo Account Hacked-social Media,twitter Ceo-Twitter CEO Account Hacked-Social Media Ceo

దాదాపు 15 నిమిషాల పాటు… వారు డోర్సీ ఎకౌంట్‌ను తమ ఆధీనంలో ఉంచుకున్నారు.అంతేకాదు ఆయన ఎకౌంట్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు.రెచ్చొగొట్టే మెసేజ్‌లు పోస్టు చేశారు.దీంతోఈ హ్యాకింగ్‌ను వెంటనే పసిగట్టిన ఎక్స్‌పర్ట్స్ డోర్సీ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్ల నుంచి కాపాడుకున్నట్లు తెలుస్తుంది.దుండగులు పోస్ట్‌ చేసిన అనుచిత సందేశాలను తొలగించారు.ఈ సందేశాల్లో జాత్యహంకార, దేశ విద్రోహ వ్యాఖ్యలు కూడా ఉంటాలు తెలుస్తుంది.ఎంతటి ప్రముఖులైనా హ్యాకర్లు వదిలిపెట్టడం లేదు.

Twitter Ceo Account Hacked-social Media,twitter Ceo-Twitter CEO Account Hacked-Social Media Ceo

సామాజిక మాధ్యమాల ఖాతాలు, బ్యాంక్‌ ఖాతాలు ఇలా ఏ తేడా లేకుండా అందులోకి చొరబడి ముప్పు తిప్పలు పెడుతున్నారు.

ట్విటర్‌ సీఈఓ, సహవ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ ఖాతా హ్యాక్ అవ్వడంతో చాలామంది భయాందోళనలకు గురవుతున్నారు.