ఆమె మృతి వల్లే సుశాంత్ చనిపోయాడా..?

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో డ్రగ్స్ గురించి వెలుగులోకి రావడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా డ్రగ్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఈ కేసులో కొంతమంది సినీ ప్రముఖుల పేర్లను వెల్లడించిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

 Twist In Sushanth Singhh Rajput Death Case, Sushanth Singh Rajput, Drugs Probe,-TeluguStop.com

అయితే సీబీఐ అధికారుల దర్యాప్తులో ఈ కేసు కొత్త మలుపులు తీసుకుంటోంది.సీబీఐతో పాటు ఎన్సీబీ బృందాలు సైతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.

మొదట సుశాంత్ మానసిక ఒత్తిడి వల్ల మృతి చెందాడని పోలీసులు, సీబీఐ అధికారులు భావించినా సుశాంత్ మృతి కేసులో వేర్వేరు వ్యక్తులు ఇస్తున్న సమాచారం సీబీఐ అధికారులనే ఒకింత గందరగోళానికి గురి చేస్తోంది.సుశాంత్ మృతికి గల అసలైన కారణాన్ని తెలుసుకోవడంలో సీబీఐ అధికారులు సైతం విఫలమవుతున్నారు.

సీబీఐ తాజాగా సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితానీని ప్రశ్నించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సిద్దార్థ్ ఈ సందర్భంగా సుశాంత్ మృతికి కొన్ని రోజుల ముందు జరిగిన పరిణామాల గురించి మాట్లాడారు.

సుశాంత్ మాజీ మేనేజర్ దిశా మృతితో సుశాంత్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడని… తనను చంపేస్తారని తరచూ చెప్పేవాడని… భద్రతను పెంచుకోవాలని అనేవాడని పేర్కొన్నారు.రియా సుశాంత్ ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్ లను తీసుకుపోయిందని చెప్పారు.

దీంతో దిశా మృతి వల్లే సుశాంత్ చనిపోయాడా…? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దిశా మృతికి, సుశాంత్ మృతికి సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సుశాంత్ మాజీ మేనేజర్ అంకిత్ ఆచార్య ఎన్సీబీ అధికారులతో మాట్లాడుతూ సుశాంత్ ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని….సుశాంత్ ది హత్యే అని బల్ల గుద్ది చెబుతున్నానని పేర్కొన్నారు.

సుశాంత్ కు డ్రగ్స్ కు బానిస అయితే కెరీర్ నాశనం అవుతుందని తెలుసని… అందువల్ల సుశాంత్ అలాంటి తప్పు మాత్రం చేయడని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube