పుష్ప 2 స్టోరీలో ట్విస్ట్.. శ్రీవల్లినే పుష్పని పోలీసులకు పట్టిస్తుందా..?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో థియేటర్ లో విడుదలైన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించాడు.

 Twist In Pushpa 2 Will Sri Valli Support Police To Arrest Pushpa Details, Pushpa 2, Tollywood, Allu Arjun, Rashmika, Telugu Film Industry, Pushpa The Rule, Pushpa 2 Twist, Rashmika Mandanna, Pushpa Raj, Director Sukumar, Pushpa 2 Story-TeluguStop.com

ఈయన సరసన ఇండియన్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.అంతేకాకుండా జగపతిబాబు, ఫహాద్ ఫాజిల్, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ తదితరులు నటించారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్, ముత్తంశెట్టి మీడియాపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

 Twist In Pushpa 2 Will Sri Valli Support Police To Arrest Pushpa Details, Pushpa 2, Tollywood, Allu Arjun, Rashmika, Telugu Film Industry, Pushpa The Rule, Pushpa 2 Twist, Rashmika Mandanna, Pushpa Raj, Director Sukumar, Pushpa 2 Story-పుష్ప 2 స్టోరీలో ట్విస్ట్.. శ్రీవల్లినే పుష్పని పోలీసులకు పట్టిస్తుందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మీరోస్లా కూబా బ్రోజెక్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించాడు.ఈ సినిమాలో బన్నీ తన ప్రత్యేక యాటిట్యూడ్ తో ముఖ్యంగా చిత్తూరు యాస తో ప్రేక్షకులను మరింత మెప్పించాడు.

ఇక ఈ సినిమా కథ అంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో సాంగ్స్ మరోక ఎత్తు అని చెప్పవచ్చు.ఈ సినిమాలో పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సినిమా పాటలు సోషల్ మీడియాలో ఇప్పటికీ తెగ సందడి చేస్తూనే ఉన్నాయి.ఇక నెటిజన్ల నుంచి సెలెబ్రేటీలు సైతం పుష్ప సినిమాలోని పాటలకు ఆడుతూ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో తెగ హడావిడి చేస్తున్నారు.

ముఖ్యంగా ‘శ్రీవల్లి’, ‘రారా సామి’ పాటలు మాత్రం ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాయి.ఈ పాటలో అల్లు అర్జున్ చేసిన సిగ్నేచర్ స్టెప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.క్రికెటర్లు సైతం ఈ స్టెప్ పై బాగా ఫోకస్ పెట్టారు.అంతేకాకుండా ఈ సినిమా పార్ట్ 2 ఉన్న సంగతి తెలిసిందే.ఇక ఇందులో శ్రీవల్లి, పుష్ప మధ్యలో లవ్ ఏర్పడుతుంది.

కాని వీరు పార్ట్ 1లో పెళ్లి చేసుకోక పోగా పార్ట్ 2 లో కూడా పెళ్లి చేసుకుంటారా లేదా అనే అనుమానాలు బాగా తలెత్తుతున్నాయి.పార్ట్ వన్ లో మాత్రం వీరిద్దరి మధ్య జరిగిన సన్నివేశాలు బాగా హైలెట్ గా మారాయి.అంతేకాకుండా వారి డైలాగులు కూడా బాగా పేలాయి.

ఇక పార్ట్ 2 లో వీరిద్దరు పెళ్లి చేసుకుంటారు అని కొందరు అనటంతో.మరి కొందరు పెళ్లి జరగదు అని శ్రీవల్లినే స్వయంగా పుష్ప ను పోలీసులకు పట్టిస్తుంది అని తెలుస్తుంది.

పైగా దానికి సంబంధించిన ఒక మీమ్ కూడా నెట్టింట వైరల్ గా మారింది.అందులో రష్మిక పోలీస్ గెటప్ లో ఉండగా పుష్ప మాత్రం జైల్లో ఉన్నాడు.పైగా తానే స్వయంగా పుష్పను పోలీసులకు పట్టించినట్లు క్రియేట్ చేశారు.దీంతో ఆ మీమ్ నెట్టింట్లో వైరల్ గా మారడంతో.నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.రా రా సామి అని పిలిచి జైల్లో పెడతావా అని కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాకుండా బాహుబలిలో కట్టప్ప కు ఉన్న ట్విస్ట్ ఇందులో ఉంది అని మరికొందరు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube