ఒకే సమయంలో ఒకరితోనే గర్భం దాల్చాలి, కవలల వింత కోరిక...!

కవలలు అంటే ఇద్దరు ఒకేలా ఉంటారని మాత్రమే మనకు తెలుసు.కానీ ఈ ఇద్దరు కవలలు మాత్రం రూపంలోనే కాదు ఆలోచనలు, అభిరుచులు, రంగు రూపు అన్నిటిలోను ఒకేలాగా ఉంటారు.

 Twins, Pregnent, Time, Viral, Australia-TeluguStop.com

ఇద్దరు ఒకలేగా ఉండడానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నారు.లిప్ ఫిల్లర్లు, బ్రెస్ట్‌ ఇంప్లాంట్లు, ముఖానికి పచ్చబొట్టు.

ఇలా ఇద్దరిలోనూ ఒకేలాగా ఉండాలనుకునేవారు.ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇద్దరు ఇప్పటివరకూ 14 శస్త్రచికిత్సలు చేయించుకున్నారు.

ఇందుకోసం 2,50,000 డాలర్ల కంటే ఎక్కువే ఖర్చు చేశారు.అయితే ఇప్పుడు ఈ కవల పిల్లలకు ఒక వింతైన కోరిక కలిగింది.

అదేంటో తెలిస్తే షాక్ అవుతారు కూడా.ఒకేలా ఉండాలనుకోవడంలో తప్పులేదు కానీ వీళ్ళు ఇద్దరు ఒకే సమయంలో ఒకరితోనే గర్భం దాల్చాలని అనుకుంటున్నారట.

అవును మీరు విన్నది నిజమే వినడానికి కొత్తగా ఉన్న ఈ కవల పిల్లల కోరిక ఇదేనట.అసలు వివరాలలోకి వెళితే ఆస్ట్రేలియాకు చెందిన అన్నా, లూసీ డిసిన్క్యూ ప్రపంచంలోనే అత్యంత సమరూప కవలలుగా ప్రసిద్ధి.

అయితే, చిన్నప్పటినుంచి తాము ఒకేవిధంగా కనిపించేలా చూసుకున్నారు.ఈ ఇద్దరు కవలలు 2012 లో బెన్ బైర్న్‌ అనే వ్యక్తితో డేటింగ్ చేశారు.

ఇద్దరు కూడా అతడినే వివాహం చేసుకోవాలని అనుకున్నారు.అయితే ఇద్దరు భార్యలు ఉండడం చట్టవిరుద్ధం కాబట్టి పెళ్లి చేసుకోలేదు.

కానీ 2018 లో అన్నా, లూసీ డిసిన్క్యూకు ఒక వింతైన కోరిక కలిగింది.అదే ఒకే వ్యక్తితో కలయిక జరిపి ఒకేసారి ఇద్దరు గర్భధారణ చేయడం.

వీళ్ళ ఇద్దరు ఓ టీవీ షో ఇంటర్వ్యూలో వీళ్ళ గర్భధారణ గురించి మాట్లాడి, అందిరినీ అవాక్కయ్యేలా చేశారు.వీరి వింత కోరిక సోషల్‌ మీడియాలో వైర్‌ల్‌ అయ్యింది.

ఈ ఇంటర్వ్యూ చేస్తున్న హోస్ట్‌ రూత్‌ లాంగ్స్‌ఫోర్డ్‌ ఆశ్చర్యానికి గురి అయ్యి ఒకే సమయంలో.ఒకరితోనే గర్భం దాల్చేందుకు ఎలా ప్లాన్‌ చేస్తున్నారు అని ప్రశ్నించగా, అక్కాచెల్లెళ్లు దీటైన జవాబు ఇచ్చారు.

‘మేం కలిసి స్నానం చేస్తాం.కలిసి పడుకుంటాం.

కలిసి తింటాం.మాకు ఒకేసారి ఆకలి అవుతుంది.

ప్రతిదీ ఒకేలా ఉంది.ఇది మీకు రుగ్మతలా కనిపించవచ్చు.

కానీ మేం జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నామో అలా జీవిస్తున్నాం.ఇద్దరం ఒకరిలానే ఉండాలనుకుంటున్నాం.

’ అని వ్యాఖ్యానించారు.‘మేం కలిసి గర్భం దాల్చాలనుకుంటున్నాం.

జీవితంలో ప్రతిదీ కలిసి చేయాలనుకుంటున్నాము.ఒకేసారి వృద్ధులం అవుతాం.

ఒకేసారి మరణిస్తాం అన్ని తెలిపి అందరికి షాక్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube