గర్భగుడిలో విగ్రహం లేని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

సాధారణంగా ఆలయం అనగానే ఆలయం గర్భగుడిలో మనకు దేవుడి విగ్రహాలు దర్శనమిస్తుంటాయి.ఈ విధంగా దేవుడి విగ్రహాలు దర్శనం కల్పించినప్పుడే ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని పూజలు నిర్వహిస్తుంటారు.

 Unknown Facts About Gujarat Sun Temple, Sanctum Temple, Sun Temple, Gujarat, Pus-TeluguStop.com

కానీ గర్భగుడిలో విగ్రహం లేని ఆలయాలు కూడా ఉంటాయని మీరు ఎప్పుడైనా విన్నారా? వినడానికి ఎంతో ఆశ్చర్యం వేసినా ఇది నిజం. గర్భ గుడిలో విగ్రహం లేకున్నప్పటికీ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి.ముఖ్యంగా సంవత్సరంలో రెండు రోజులలో జరిగే ఆ వింతను చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.

ఇంతకీ ఆలయం ఏది? ఆలయం ఎక్కడ ఉంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం….
మనదేశంలో సూర్య దేవాలయాలు చాలా ఉన్నాయి.

అయితే అన్ని ఆలయాలలో కెల్లా ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైనది.గుజరాత్ రాష్ట్రం, మోహసానా జిల్లాలో మోఢేరా అనే ప్రాంతంలో అతి పురాతన సూర్యదేవాలయాం ఉంది.

ఈ ఆలయం పుష్పవతి నది ఒడ్డున ఉంది.ఈఆలయాన్ని చాళుక్య వంశానికి చెందిన రాజులు నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి.

పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన తర్వాత తను బ్రహ్మ హత్య పాపం తొలగించుకోవడం కోసం ఈ ప్రాంతాన్ని సందర్శించాలని వశిష్ఠ మహర్షి శ్రీ రాముడికి చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ ఆలయ విషయానికి వస్తే ఆలయంలో గర్భగుడిలో ఉన్న పీఠంపై మనకు విగ్రహం కనిపించదు.

పురాణాల ప్రకారం పూర్వం ఈ పీఠంపై సూర్యభగవానుడు వచ్చి కూర్చుని వెళ్ళాడని అక్కడి ప్రజల నమ్మకం.అందుకే ఈ ఆలయాన్ని సూర్యభగవానుడి ఆలయంగా భావించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు.

అదేవిధంగా సంవత్సరంలో రెండు రోజులు ఈ ఆలయంలో అద్భుతమైన వింత చోటుచేసుకుంది.మార్చి 21 వ తేదీ కానీ సెప్టెంబర్ 23 వ తేదీన కానీ ఈ ఆలయానికి సూర్యోదయం కాకముందు ఈ ఆలయానికి ఎంతో మంది భక్తులు చేరుకుంటారు.

ఈ రెండు రోజుల్లో సూర్యుడు భూమధ్యరేఖని దాటడం జరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు నిర్దారణ చేసారు.ఆ రోజుల్లో పగలు, రాత్రి సమానంగా ఉంటాయి.

అందుకోసమే ఈ రెండు రోజులలో ఉదయం నుంచి సూర్య కిరణాలు సూర్యపీఠాన్ని తాకుతాయి.ఈఅద్భుతాన్ని చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటారు.

ఈ విధంగా గర్భ గుడిలో విగ్రహం లేని ఆలయంగా ఎంతో ప్రసిద్ధి చెందింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube