దక్షిణ కాలిఫోర్నియా లో పడవ ప్రమాదం,34 మంది గల్లంతు

అగ్రరాజ్యం అమెరికా లో మరో ప్రమాదం చోటుచేసుకుంది.మొన్న ఒక ఆగంతకుడు సామాన్యుల పై కాల్పులు జరపడం తో ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.

 Twenty Six People Missing In South California Dive Boat-TeluguStop.com

అయితే ఇంకా ఆ ఘటన మరువక ముందే దక్షిణ కాలిఫోర్నియా లో ఒక ప్రమాదం చోటుచేసుకుంది.దక్షిణ కాలిఫోర్నియా సమీపంలోని శాంటాక్రూజ్‌ దీవి తీర ప్రాంతంలో ఓ పడవలో మంటలు చెలరేగాయి.

ఒక్కసారిగా పడవ లో మంటలు చెలరేగి మొత్తం అంతా వ్యాపించడం తో అందులో ఉన్న 34 మంది గల్లంతైనట్లు తెలుస్తుంది.అగ్నిప్రమాదం తర్వాత పడవ సముద్రంలో మునిగిపోయింది.

అయితే ఐదుగురిని తీరరక్షక దళం కాపాడినట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే తీర రక్షక దళం రంగంలోకి దిగడం తో బోటు పై భాగంలో ఉన్న సిబ్బంది ని మాత్రం రక్షించగలిగారు.

అయితే బోటు లోపల ఉన్న 34 మంది మాత్రం గల్లంతు అయినట్లు తెలుస్తుంది.అయితే రక్షించిన ఐదుగురి లో ఒకరు స్వల్పంగా గాయపడగా మిగిలిన వారు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ ప్రమాదంలో గల్లంతైన వారి లో ఎంతమంది చనిపోయారు అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదం లో ఎంతమంది ప్రాణాలతో బయటపడగలుగారు అన్న దానిపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Telugu Calinia Dive, Americaplace, Dive, Monday-

శాంట క్రూజ్ ద్వీపానికి 18మీటర్ల దూరంలో పడవ ప్రమాదానికి గురవ్వగా, మొత్తం ఎనిమిది మంది మృతి చెందినట్టు రెస్క్యూ సిబ్బంది గుర్తించారు.అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube