ముత్తాత, తాతమ్మలపై హత్యాయత్నం... కాపాడిన 12 ఏళ్ల బాలుడు

సోదరుడి బారి నుంచి ముత్తాతలను కాపాడిన 12 ఏళ్ల బాలుడు టెక్సాస్‌లో హీరోగా మారాడు.హారీస్ కౌంటీ షరీఫ్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.

 Twelve Years Grandson Saving Great Grandparents-TeluguStop.com

కాటికి చెందిన లూసియాన్ జాన్‌స్టన్ 20, సచ 12 అనే ఇద్దరు తమ ముత్తాత, తాతమ్మతో కలిసి ఆదివారం కారులో వెళుతున్నారు.

ఈ సమయంలో లూసియన్ ప్రవర్తన కారణంగా ఇకపై నీతో ఉండలేమంటూ పెద్దవారు చెప్పడంతో ఆ కుర్రాడు తీవ్ర ఆగ్రహానికి గురై.

వారితో వాగ్వాదానికి దిగాడు.అక్కడితో ఆగకుండా పాకెట్ నైఫ్‌తో ముత్తాత, తాతమ్మ తల, మెడపై విచక్షణారహితంగా పొడవటం ప్రారంభించాడు.

ప్రమాదాన్ని పసిగట్టిన సాచా వెంటనే తన అన్నయ్యపై దాడికి దిగి కత్తిని లాక్కొని, దానిని కిటికీలోంచి విసిరేశాడు.దీంతో లూసియాన్ అక్కడి నుంచి పారిపోయాడు.

Telugu Telugu Nri Ups, Twelve Boy-

గాయాలతోనే ఆ పెద్దవారు స్వయంగా కారు నడుపుకుంటూ ఆసుపత్రికి వెళ్లారు.చికిత్స అనంతరం సోమవారం రాత్రి వారిద్దరిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లూసియన్‌ను అదుపులోకి తీసుకున్నారు.చిన్న పిల్లాడినని అనుకోకుండా ప్రాణాలకు తెగించి ముత్తాత, తాతమ్మను కాపాడిన సాచాను పోలీసులు అభినందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube