వరదల వల్ల మీ బండి పాడైందా..? అయితే ఇది మీరు చదవాల్సిందే  

TVS Offers Free Service to Flood effected vehicles, tvs offer to own customers, vehicle, floods, hyderabad, free servicing, no charges - Telugu Floods, Hyderabad, Hyderabd, No Charges, Tvs Offer To Own Customers, Tvs Offers Free Service To Flood Effected Vehicles, Vechils, Vehicle, Water

ఇటీవల వరదలకు హైదరాబాద్ అతలాకుతలమైంది.చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వచ్చిన భారీ వరదలకు హైదరాబాద్ ప్రజలు బెంబేలెత్తిపోయారు.

TeluguStop.com - Tvs Bumper Offer Free Service Flood Effected Bikes

ఎక్కడ చూసినా రోడ్లన్నీ చెరువుల్లా కనిపించాయి.లోతట్లు ప్రాంతాల్లో ఇళ్లన్నీ మునిగిపోవడంతో అక్కడ నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్‌లో ఇంత భారీ వర్షపాతం నమోదు కావడం 40 సంవత్సరాల తర్వాత ఇది రెండోసారి అని ఇటీవల భారత వాతావరణశాఖ కూడా ప్రకటించింది.

TeluguStop.com - వరదల వల్ల మీ బండి పాడైందా.. అయితే ఇది మీరు చదవాల్సిందే-Business - Telugu-Telugu Tollywood Photo Image

వరదతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు చాలా స్వచ్ఛంధ సంస్థలతో పాటు సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ముందుకొచ్చారు.

వరద బాధితులకు తమ వంతుగా ఆర్థిక సహాయం ప్రకటించారు.బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు వరద బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించిన వారిలో ఉన్నారు.

అయితే వరదల వల్ల రోడ్లు చెరువుల్లా మారిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.కొన్ని ప్రాంతాల్లో వాహనాలు చాలారోజుల పాటు నీటిలోనే ఉండిపోవడంతో పాడైపోయాయి.

ఇక కొన్నిచోట్ల వాహనాల లోపలికి నీళ్లు పోయి చెడిపోయాయి.ఈ క్రమంలో హైదరాబాద్‌లో వరదలకు వాహనాలు పాడైపోయిన తమ కస్టమర్లకు టీవీఎస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

వరదల్లో పాడైపోయిన వాహనాలకు ఫ్రీ సర్వీసింగ్ ఉంటుందని ప్రకటించింది.హైదరాబాద్‌లోని అన్ని సర్వీస్ సెంటర్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, మరిన్ని వివరాలకు 9121177261 నంబర్‌కు కాల్ చేయవచ్చని వెల్లడించింది.

అయితే వాహనదారులు కేవలం స్పేర్ పార్ట్‌లు కొనుక్కుంటే చాలని, సర్వీసింగ్‌కు సంబంధించిలేబర్ ఛార్జ్ తీసుకోమంది.

#TvsOffer #Hyderabad #Vehicle #TVSOffers #Hyderabd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tvs Bumper Offer Free Service Flood Effected Bikes Related Telugu News,Photos/Pics,Images..