ర‌విప్ర‌కాశ్ ఉంటే ఏంటి? లేక‌పోతే ఏంటి? నేనే మొన‌గాడిని!  

Tv9 Trp Ratings Increased - Telugu 76.26, Ravi Prakash, Telugu News Channels, Tv9 Trp Ratings, V6 Channel

రవిప్రకాశ్‌ తెలుసు కదా.తెలుగులో టీవీ జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించిన వ్యక్తి.

Tv9 Trp Ratings Increased

అసలు తెలుగు వాళ్లకు న్యూస్‌ చానెల్ అంటే టీవీ 9 అనే స్థాయికి ఆ చానెల్‌ను తీసుకెళ్లారు.సెన్సేషనలిజానికి ఆ చానెల్‌ కేరాఫ్‌ అడ్రెస్‌.

బ్రేకింగ్‌ న్యూస్‌లను తనదైన స్టైల్లో అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం టీవీ 9 ప్రత్యేకత.దశాబ్దన్నర కాలంగా ఆ చానెల్‌ ఆధిపత్యాన్ని అధిగమించడానికి మిగతా న్యూస్‌ చానెల్స్‌ చాలా ప్రయత్నాలే చేశాయి.

ర‌విప్ర‌కాశ్ ఉంటే ఏంటి లేక‌పోతే ఏంటి నేనే మొన‌గాడిని-General-Telugu-Telugu Tollywood Photo Image

చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే ఆ చానెల్‌కు సమానంగా రేటింగ్స్‌ సాధించడం, దాని దరిదాపుల్లోకి వెళ్లడం చేశాయి.అయితే ఈ మధ్య టీవీ 9లో కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

యాజమాన్యం మారిపోయింది.చానెల్‌కు మూలస్తంభంగా ఉన్న సీఈవో రవిప్రకాశ్‌ అవమానకర రీతిలో ఆ చానెల్‌ను వీడాల్సి వచ్చింది.

ఫోర్జరీ కేసులో ఆ తర్వాత ఆయనను అరెస్ట్‌ కూడా చేశారు.అయితే రవిప్రకాశ్‌ లేకపోవడంతో టీవీ 9 పనైపోయినట్లేనని చాలా మంది భావించారు.

ఆ చానెల్‌ను వెనక్కి నెట్టడానికి ఇదే మంచి సమయమని మిగతా చానెల్స్‌ కూడా ఆశించాయి.అందుకు తగినట్లే మొదట్లో టీవీ 9 రేటింగ్స్‌ కాస్త పడిపోయినట్లుగా కనిపించాయి.కానీ తాజాగా ఈ ఏడాది 45వ వారానికి సంబంధించిన రేటింగ్స్‌ మిగతా చానెల్స్‌కు దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చాయి.26 రేటింగ్‌తో టీవీ 9 ఎవరికీ అందనంత ఎత్తులో నిలవడం విశేషం.రెండోస్థానంలో ఉన్న వీ6 చానెల్‌ 32 పాయింట్లు వెనుకబడి 44 రేటింగ్‌తో సరిపెట్టుకుంది.

మరో విచిత్రం ఏమిటంటే.టాప్‌ 5 చానెల్స్‌ మినహాయించి ఆ తర్వాత ఉన్న పది చానెళ్ల రేటింగ్స్‌ అన్నీ కలిపినా టీవీ 9కు సమానంగా లేవు.రవిప్రకాశ్‌ చానెల్‌ను వదిలి వెళ్లిన తర్వాత మళ్లీ తన మార్క్‌ను నిలబెట్టుకోవడానికి టీవీ 9 గట్టి ప్రయత్నాలే చేస్తోంది.కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించడంతోపాటు బిత్తిరి సత్తిలాంటి జనాదరణ ఉన్న వ్యక్తిని తెచ్చి పెట్టుకుంది.దీంతో మొదట్లో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించిన ఆ చానెల్‌.

క్రమంగా మళ్లీ తన పునర్‌వైభవాన్ని చాటుకుంటోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tv9 Trp Ratings Increased Related Telugu News,Photos/Pics,Images..

footer-test