టీవీ9 లో కొనసాగాలని ఉంది, కుదరదంటే..!  

Tv9 Ravi Prakash Interview టీవీ9 -

15 ఏళ్ల క్రితం టీవీ9ను ప్రారంభించి, దేశంలోనే నెం.1 గా తీర్చి దిద్దిన వ్యక్తి రవి ప్రకాష్‌.ఆయన ఎంచుకున్న మార్గంపై తీవ్ర విమర్శలు వచ్చినా కూడా ఆయన పట్టించుకోలేదు.వార్తల కోసం జీవితాలను నాశనం చేస్తున్నాడని, ఆయన చేసిన ఘోరాలు చాలా ఉన్నాయంటూ ఈమద్య కాలంలో చాలా బయటకు వస్తున్నాయి.

Tv9 Ravi Prakash Interview టీవీ9

టీవీ 9 సీఈఓ పదవి నుండి రవి ప్రకాష్‌ను కొత్త యాజమాన్యం తొలగించింది.

పలు కేసులు ఉన్న కారణంగా ప్రస్తుతం అజ్ఞాతవాసంలో ఉన్న రవి ప్రకాష్‌ కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు.

తెలంగాణ పోలీసులు జల్లెడ పట్టి మరీ రవి ప్రకాష్‌ కోసం వెదుకుతున్నారు.ఈ సమయంలోనే ఆయన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాను ప్రారంభించిన టీవీ9లోనే ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఒక వేళ తనకు టీవీ9 లో చోటు లేదంటే మాత్రం కొత్త ఛానెల్‌ను ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించాడు.

కొత్త ఛానెల్‌ ఎప్పుడు ప్రకటించేది, అది ఏంటీ అనేది త్వరలోనే వెళ్లడిస్తానని అన్నాడు.పోలీసులకు చిక్కకుండా తిరగడంకు కారణం ఉందని, అది త్వరలోనే తెలుస్తుందని ఈ సందర్బంగా రవి ప్రకాష్‌ అన్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tv9 Ravi Prakash Interview టీవీ9- Related....