టీవీ 9 దేవి నాగవల్లి చేసే సహాయ కార్యక్రమాలు గురించి తెలిస్తే...

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతుంది.అయితే గత వారం ఎలిమినేషన్లో షో నుంచి వెళ్లిపోయిన  టీవీ9  యాంకర్ మరియు జర్నలిస్ట్ దేవి నాగవల్లి అద్భుత ప్రదర్శన కనబరిచినప్పటికీ ఎందుకో ఆమె ఎలిమినేట్ అవ్వడంతో సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ విషయం గురించి నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

 Tv9 News Reader Devi Nagavalli Helping News, Devi Nagavalli,tv9 News Reader, Jou-TeluguStop.com

 అయితే తాజాగా టీవీ9 దేవి నాగవల్లి తమ్ముడు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో ముఖ్యంగా దేవి నాగవల్లి ప్రతి సంవత్సరం విశాఖపట్టణంలోని ఓ ట్రస్ట్ ద్వారా చదువుకుంటున్న కొంత మంది అనాధ పిల్లలకు సహాయంగా దాదాపుగా లక్ష రూపాయలు పంపుతుందని తెలిపాడు.

అంతేగాక తన ఇంట్లో పనిచేసే ఓ మహిళా సిబ్బంది  కూతురు పెళ్లి కి కూడా దేవి దాదాపుగా 50 వేల రూపాయలు ఇచ్చిందని చెప్పుకొచ్చాడు.అయితే ఆ మధ్య 60 సంవత్సరాలు పైబడిన ఓ  వృద్ధుడు పెన్షన్ కోసం టీవీ9 సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం చేయాలని టీవీ9 ఆఫీస్ కి వచ్చిన సమయంలో దేవి నాగవల్లి అతడి గురించి తెలుసుకొని నెలనెలా  1000 రూపాయలు పంపిస్తుందని, అంతేగాక బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి వెళ్లేముందు కూడా వారి అకౌంట్ లో 4 వేల రూపాయలు జమ చేసిందని తెలిపాడు.

దీంతో దేవి నాగవల్లి చేసినటువంటి ఈ మంచి పనులు బయటకు తెలియడంతో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొందరు  దేవి నాగవల్లిని ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలని కోరుతున్నారు. అంతేగాక దేవి నాగవల్లి బిగ్ బాస్ హౌస్ లో చాలా బాగా ఆడుతుందని అలాంటి మంచి కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడం ఏంటని అంటూ షో నిర్వాహకులని ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube