మోహన్ బాబు గన్ తీసుకొచ్చి కాల్చి పారేస్తానని బెదిరించాడంటున్న సీనియర్ జర్నలిస్ట్..

Tv9 Former Journalist Zakeer Sensational Comments On Manchu Mohan Babu

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొన్ని వందల చిత్రాల్లో హీరోగా నటించి మరియు నిర్మాతగా వ్యవహరించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరో మోహన్ బాబు గురించి దాదాపుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది.అయితే ఇటీవలే మంచు మోహన్ బాబు తన పెద్ద కొడుకు అయిన మంచు విష్ణు ని టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో నిలబెట్టి గెలిపించాడు.

 Tv9 Former Journalist Zakeer Sensational Comments On Manchu Mohan Babu-TeluguStop.com

కాగా ఈ ఎన్నికలలో ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా అధ్యక్ష పదవికి పోటీ చేశాడు.కానీ దురదృష్టవశాత్తు విజయం సాధించలేకపోయాడు.

దీంతో ఈ నెల 16వ తారీఖున మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు.

 Tv9 Former Journalist Zakeer Sensational Comments On Manchu Mohan Babu-మోహన్ బాబు గన్ తీసుకొచ్చి కాల్చి పారేస్తానని బెదిరించాడంటున్న సీనియర్ జర్నలిస్ట్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా తెలుగు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు జాకీర్ ఈ విషయం గురించి స్పందిస్తూ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇందులో భాగంగా సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కి టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పలుకుబడి కారణంగానే మంచు విష్ణు ఎన్నికలలో గెలిచాడని చెప్పుకొచ్చాడు.అలాగే గతంలో మోహన్ బాబుతో జరిగినటువంటి ఓ సంఘటన గురించి కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు.

కాగా తాను ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన టీవీ9 లో జర్నలిస్ట్ గా పని చేస్తున్నప్పుడు మంచు మోహన్ బాబు గురించి ఓ వార్త ప్రచురితం చేసినందుకు మోహన్ బాబు ఏకంగా రివాల్వర్ తో టీవీ9 ఆఫీస్ కి వచ్చి నానా హంగామా చేశాడని తెలిపాడు.ఈ క్రమంలో రవి ప్రకాష్ ఎక్కడ కాల్చి పడేస్తా.

అంటూ బెదిరించాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఆ తర్వాత కొంత మంది ఉద్యోగులు సర్దిచెప్పడంతో విషయం సద్దుమణిగిందని తెలిపాడు.

Telugu Manchu Mohan Babu, Mohan Babu Gun Firing In Tv9 Office, Tollywood, Tv9 Former Journalist, Tv9 Former Journalist Zakeer Sensational Comments On Manchu Mohan Babu, Zakeer-Movie

కానీ మోహన్ బాబు గురించి ప్రచురితం చేసిన వార్త గురించి మాత్రం ఎలాంటి విషయాలను తెలియజేయలేదు.దీంతో సీనియర్ జర్నలిస్టు జాకీర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అంతేగాక ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ సెలబ్రిటీ హోదా లో ఉన్నటువంటి వ్యక్తులు ఓ సంస్థలో పని చేసేటటువంటి ఉద్యోగుల పట్ల ఇలా అనుచితంగా ప్రవర్తించడం సరికాదని ఏదైనా అభ్యంతరాలు ఉంటే వారి యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా చర్చించి పై అధికారులతో కలిసి నిర్ణయం తీసుకోవాలని అంతేగాని ఇలా రివాల్వర్ తో వచ్చి బెదిరించడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Zakeer #TvJournalist #Tv Journalist

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube