ఇదేంటి టీవీ 9 ? రేవంత్ కు అంత ప్రచారం అవసరమా ?  

Tv9 Focus On Revanth Reddy - Telugu Ktr Farm House, Revanth Reddy, Revanth Reddy Fly Drone Camera On Ktr Farm House, Telangana Congress Party, Tv 9 And Revanth Reddy, Tv9, Land

మంచో చెడో ఏదో ఒక అంశంతో జనాల్లో నానుతూ ఉంటేనే రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది.ఈజీగా జనాలు గుర్తింపు రావడంతో పాటు రాజకీయ భవిష్యత్తు కూడా ముందుకు తీసుకు వెళుతుంది.

 Tv9 Focus On Revanth Reddy - Telugu Ktr Farm House, Revanth Reddy, Revanth Reddy Fly Drone Camera On Ktr Farm House, Telangana Congress Party, Tv 9 And Revanth Reddy, Tv9, Land-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తనపై జరుగుతుంది తప్పుడు ప్రచారం, మంచి ప్రచారం అనే విషయాన్ని పక్కన పెడితే ఏదో ఒక ప్రచారం జరుగుతుందా లేదా అనేది రాజకీయ నాయకులు చూస్తూ ఉంటారు.ఇక మంచి చెడు అంటే ఏదైనా కొద్దిరో జులకు మరిచిపోతారు కానీ గుర్తింపు వస్తే మాత్రం వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు అనే సూత్రాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలోనూ నిజం అవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి.

ప్రధానంగా టీవీ9 ఛానల్లో రేవంత్ రెడ్డి గురించి పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతోంది.ఆ ప్రచారాన్ని రేవంత్ రెడ్డి గాని ఆయన వర్గీయులు గాని దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఇదేంటి టీవీ 9 రేవంత్ కు అంత ప్రచారం అవసరమా - Tv9 Focus On Revanth Reddy - Telugu Ktr Farm House, Revanth Reddy, Revanth Reddy Fly Drone Camera On Ktr Farm House, Telangana Congress Party, Tv 9 And Revanth Reddy, Tv9, Land-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఎందుకంటే సదరు న్యూస్ ఛానల్ యాజమాన్యం టిఆర్ఎస్ కు బాగా కావాల్సిన వ్యక్తులు కావడంతో జనాలు కూడా మీడియా చానళ్లను కూడా పార్టీ చానల్స్ గా చూస్తూ ఉండడంతో, తన విషయాన్నిటీవీ 9 ఛానెల్ లో అదే పనిగా వస్తున్నా రేవంత్ కానీ, ఆయన వర్గీయులు కానీ పెద్దగా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు.కొద్ది రోజులు క్రితం కేటీఆర్ ఫామ్ హౌస్ లో డ్రోన్ కెమెరా ఎగురవేసి సంచలనం సృష్టించిన రేవంత్ అదే కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు.ఇక అప్పటి నుంచి సదరు టీవీ9 న్యూస్ ఛానల్ లో రేవంత్ రెడ్డికి సంబంధించిన కథనాలు ప్రచారం అవుతున్నాయి.రేవంత్ రెడ్డి వ్యవహారాలు అన్నిటిని తవ్వి తీస్తోంది టీవీ 9.ఆయన అనేక భూ కబ్జాలకు దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడ్డారంటూ అదేపనిగా కథనాలు ప్రచారం చేస్తోంది.దీంతో రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా హైలెట్ అవుతోంది.

రేవంత్ ను టీవీ9 ఇంత ఫోకస్ చేయడం వెనుక కారణాలు ఏంటా అనే చర్చ కూడా జరుగుతోంది.రేవంత్ రెడ్డి గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నా, జనాల్లో మాత్రం చర్చ వేరే రకంగా నడుస్తోంది.దీంతో రేవంత్ రెడ్డి మరింత బలమైన నేతగా టీవీ9 తయారు చేస్తున్నట్లుగా వ్యవహారం కనిపిస్తోంది.టిఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్న కారణంగానే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించడమే కాకుండా, ఇప్పుడు టిఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న టీవీ9 ఛానల్ ద్వారా ఈ విధంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారనే విషయం జనాల్లో బాగా చర్చకు వస్తోంది.

మొత్తంగా చూస్తే రేవంత్ రెడ్డి విషయంలో tv9 కాస్త అతి చేస్తున్నట్లు కనిపించినా, రేవంత్ జనాల ముందు దోషిగా నిలబెట్టేందుకు చూస్తున్నా, అదంతా తిరిగి తిరిగి ఆయనకు అనుకూలంగా మారుతున్నట్లు గా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు

Revanth Reddy,revanth Reddy Fly Drone Camera On Ktr Farm House,telangana Congress Party,tv 9 And Revanth Reddy,tv9,tv9 Focus On Revanth Reddy Land- Related Telugu News,Photos/Pics,Images..