తనపై అభియోగాలపై వీడియో రిలీజ్ చేసిన రవిప్రకాష్! సోషల్ మీడియాలో వైరల్  

వీడియో మెసేజ్ రిలీజ్ చేసిన టీవీ9 మాజీ సిఈఓ రవిప్రకాష్. .

Tv9 Ex Ceo Ravi Prakash Release New Video Massage-my Home,release New Video Massage,social Media,tv9

గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలలో టీవీ9 వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి అందరికి తెలిసిందే. టీవీ9 మాజీ సిఈఓ రవిప్రకాష్ కి, సంస్థ మేనేజ్మెంట్ కి మధ్యన మొదలైన వివాదం చివరికి రవిప్రకాష్ ని సిఈఓ పదవి నుంచి తప్పించేంత వరకు వచ్చింది. ఇక అదే సమయంలో యాజమాన్యం రవిప్రకాష్ మీద కొన్ని అభియోగాలు మోపుతూ అతని మీద పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం మరింత సీరియస్ గా మారింది. ఇక రవిప్రకాష్ ని పదవి నుంచి తప్పించిన తర్వాత గత కొంత కాలంగా ఎవరికి కనిపించని అతను తాజాగా ఓ వీడియో సందేశం విడుదల చేసాడు..

తనపై అభియోగాలపై వీడియో రిలీజ్ చేసిన రవిప్రకాష్! సోషల్ మీడియాలో వైరల్ -TV9 Ex CEO Ravi Prakash Release New Video Massage

ఇందులో టీవీ9 న్యూస్ చానల్ ని 15 ఏళ్ల క్రితం మొదలెట్టి దానిని ఎంతో కష్టపడి అభివృద్ధి చేసి లాభాల బాటలో నడిపిస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన యాజమాన్యం తనని ఒక ఉద్యోగిగా పని చేయమని చెప్పడంతో వారికి తాను ఎదురుతిరిగానని, అలాగే తన షేర్స్ పై బాండ్ రాయమని అడిగినందుకు తనపై యాజమాన్యం కక్ష పెంచుకొని తనపై అన్ని రకాలుగా దాడులు చేసి, భయపెట్టే ప్రయత్నం చేస్తుందని, అలాగే తమపై తప్పుడు అభియోగాలు పెట్టి కేసు పెట్టి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. అలాగే టీవీ9 యాజమాన్యం చెప్పినట్లు పోలీసులు కూడా వింటూ నిజానిజాలు తెలుసుకోకుండా తనకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి, తనని ఎక్కడికి వెళ్ళనీయకుండా చేస్తున్నారని విమర్శించారు. ఇక రవిప్రకాష్ విమర్శలని టీవీ9 యాజమాన్యం కూడా వెంటనే ఖండించి, ఆరోపణలు నిజమైతే పోలీసుల ముందుకి వచ్చి సమాధానం చెప్పుకోవాలని చెప్పింది.